Tea : వర్షాకాలంలో టీ తాగటం ఆరోగ్యానికి మేలేనా?

టీ తాగటం వల్ల వర్షకాలంలో జీర్ణాశయ వ్యవస్థను మెరుగవుతుంది. రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి మనల్ని కాపాడటంలో తోడ్పడుతుంది.

Tea : వర్షాకాలంలో టీ తాగటం ఆరోగ్యానికి మేలేనా?

Tea

Tea : వర్షాకాలంలో వచ్చిందంటే చాలు చాలా మంది వేడి వేడి టీ ని రోజు రెండు, మూడు సార్లు తాగేస్తుంటారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు, జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫివర్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో సాధారణ టీకంటే అందులోకొన్ని కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. వర్షకాలంలో బ్లాక్ టీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ, చాయ్, అల్లం టీ తాగటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, ఈ సీజన్‌లో వచ్చే గొంతు మంట, దగ్గు, జలుబు వంటివి దరి చేరకుండా కాపాడుకోవచ్చు. అంతే కాకుండా తులసి టీ, హెర్బల్ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ టీలు తాగటం వల్ల ఇందులో ఉండే యాంటీఫంగల్‌ లక్షణాలు ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడతాయి. రోగనిరోధక శక్తి మెరుగుపరచుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకునేందుకు సహాయపడతాయి. టీ తాగటం వల్ల రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది.

టీ తాగటం వల్ల వర్షకాలంలో జీర్ణాశయ వ్యవస్థను మెరుగవుతుంది. రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి మనల్ని కాపాడటంలో తోడ్పడుతుంది. గుండె వ్యాధులు, క్యాన్సర్, బరువు తగ్గడం, నిరోధిస్తుంది. పాడైన జీవకణాలను ఉత్తేజపరుస్తుంది. టీ ని పెట్టుకునేటప్పుడు కొద్దిగా అల్లం లేదా దాల్చిని, లవంగాలను ఉపయోగించాలి. వీటిని ఉపయోగించటం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అలానే ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. బరువుని అదుపులో ఉంచడానికి కొవ్వులు కరగటానికి సహాయపడతాయి. టీలో చక్కెరను తగ్గిస్తే శరీరానికి అందే కేలరీలు తగ్గుతాయి.