Beetroot Juice: ఇది తాగితే 10రోజుల్లో మీ హెల్త్ సెట్ అయిపోతుందంతే..

జూస్ తాగడం ఈజీ అంతే. మరి తాగిన తర్వాత షుగర్ లెవల్స్ హెల్త్ పై ఎంత ప్రభావం కనిపిస్తుందో అనే అనుమానం..

Beetroot Juice: ఇది తాగితే 10రోజుల్లో మీ హెల్త్ సెట్ అయిపోతుందంతే..

Beetroot Juice

Beetroot Juice: జూస్ తాగడం ఈజీ అంతే. మరి తాగిన తర్వాత షుగర్ లెవల్స్ హెల్త్ పై ఎంత ప్రభావం కనిపిస్తుందో అనే అనుమానం ఉండనే ఉంటుంది. కానీ, ఇది అలాంటిది కాదు. కార్డియోవాస్క్యూలర్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ పై పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

యూకేకు చెందిన ఎక్సెటర్ యూనివర్సిటీ ఫిజియాలజీ రీసెర్చర్స్ 26మందిపై స్టడీ జరిపారు. 70 నుంచి 80 సంవత్సరాల వయస్సున్న వారు 10 రోజుల పాటు బీట్ జ్యూస్ తాగారు. నైట్రేట్స్ రూపంలో కెమికల్స్ అత్యధికంగా ఉంటాయి. అంటే రోజుకు రెండుసార్లు ఈ జ్యూస్ తాగాలి.

గత రీసెర్చ్ లో మన శరీరానికి నైట్రేట్ ను నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చే కెపాసిటీ తగ్గిపోవడం వల్లనే కార్డియోవాస్క్యూలర్ హెల్త్, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ అనేది శరీరంలో తగ్గిపోతుందని తేలింది. శరీరం కరెక్ట్ గా పనిచేస్తే.. నోటిలో రక్త కణాలను ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన రక్త సరఫరాకు కారణమై గుండె, మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.

బ్యాక్టీరియా లెవల్స్ తక్కువగా ఉండి వాస్క్యూలర్, కాగ్నిటివ్ హెల్త్ లు అధిగకంగా ఉండటంతో బీట్ జ్యూస్ శరీరంపై మంచి ప్రభావం చూపిస్తాయి.

నైట్రేట్ అధికంగా ఉండే ఆహారాన్ని డైట్ లో చేర్చుకుంటే.. అది కూడా బీట్ రూట్ జ్యూస్ తో చేయగలిగితే.. పదిరోజుల్లో హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. అని రీసెర్చర్, ప్రొఫెసర్ ఎన్ని వన్హతాలో వివరించారు. ఇంకా ఈ స్టడీలో పాలకూర, క్యాబేజీలలో అత్యధికంగా నైట్రేట్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.