ఎక్కడో తెలుసా? : ప్రపంచంలోనే తొలి మెరైన్ చేపల సశ్మానం!

  • Published By: sreehari ,Published On : December 30, 2019 / 10:13 AM IST
ఎక్కడో తెలుసా? : ప్రపంచంలోనే తొలి మెరైన్ చేపల సశ్మానం!

వాతావరణంలో మార్పులతో జీవావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పర్యావరణంపై నిర్లక్ష్యంతో ప్రత్యేకించి సముద్రంలో జీవించే ఎన్నో జీవజాతులకు ప్రాణసంకటంగా మారుతోంది. పర్యావరణాన్ని పీల్చేవేస్తున్న ప్లాస్టిక్ భూతం జీవజాతుల పట్ల ప్రాణాంతకంగా మారింది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా మెరైన్ లోని ఎన్నోజీవజాతులు నశించిపోతున్నాయి. సముద్రపు జీవుల్లో చేప జాతికి చెందిన ఎన్నో జలచర జీవులు అంతరించిపోతున్నాయి. ఇలా అంతరించిపోతున్న చేప జాతులన్నీ గుర్తిండిపోయేలా కొన్ని జీవావరణ సంబంధిత బృందాలు చేపల సశ్మానాన్ని నిర్మించాయి. కేరళలోని కోజికోడ్ లో బేపూర్ బీజ్ దగ్గర ఈ చేప జాతుల సశ్మానాన్ని చూడవచ్చు. 
Marine Cemetery

ఇది ప్రపంచంలోనే తొలి మెరైన్ సశ్మానంగా పిలుస్తుంటారు. అంతరించిపోతున్న 8 మెరైన్ చేప జాతుల్లో (సీ హార్స్, హమ్మర్ హెడ్ షార్క్, ప్యారట్ ఫిష్, లెథర్ బ్యాక్ టర్టల్, ఈగల్ రే, డగాంగ్, సాఫిష్, జీబ్రా షార్క్)లకు గుర్తుగా ఈ సశ్మానాన్ని నిర్మించారు. చేప జాతులతో కూడిన చెలియార్ నది ప్రాంతాన్ని ‘మిస్ కేరళ’గా ప్రసిద్ధి చెందింది. ఈ సశ్మానాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో డిజైన్ చేశారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్, మానవుల జీవనశైలి మధ్య మెరైన్ జీవజాతుల నాశనానికి ఎలా దారితీస్తుందో ఇది తెలియజేస్తుంది. ఇండియాలో ప్రతిరోజు 25వేల 940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టకొస్తున్నాయి. ఇందులో ఏడాదిలో 6.4 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రతీర ప్రాంతాల్లోకి వెళ్లి కలుస్తున్నాయి.
Marine

50శాతం బీచ్ ల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో సముద్ర జీవులకు హనికరంగా మారింది. పరిమితికి మించి వినియోగంతోనే నీటి కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమవుతోంది. వాతావరణం కూడా మార్పులు సంభవిస్తున్నాయి. తద్వారా 15 సముద్ర జీవజాతుల వినాశనానికి దారితీస్తోంది.

ఇంకా 700కు పైగా మెరైన్ జాతులు ప్రమాదంలో ఉన్నాయి. జెల్లీఫిష్ వాటర్ స్పాట్స్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాగా, క్లీన్ బీచ్ మిషన్, కోజికోడ్ జిల్లా యంత్రాంగం, బేపూర్ పోర్ట్ డిపార్ట్ మెంట్ మద్దతుతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా ఏర్పాటు చేశారు. 
Marine fish