Black Grapes : చలికాలంలో నల్ల ద్రాక్ష తినటం ఆరోగ్యానికి మేలే!…

రుతుస్రావం స‌మ‌యంలో నొప్పిని త‌గ్గించ‌డంలో కూడా న‌ల్ల ద్రాక్ష స‌హాయ‌ప‌డుతుంది. ఎండుద్రాక్షలో అధిక పొటాషియం స్థాయి రక్తం నుంచి సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది.

Black Grapes : చలికాలంలో నల్ల ద్రాక్ష తినటం ఆరోగ్యానికి మేలే!…

Black Grapes

Black Grapes : చలికాలంలో నల్ల ద్రాక్ష తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో శాస్వకోశ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ సమస్యలను రాకుండా ఉండేందుకు నల్లద్రాక్ష తీసుకోవటం మంచిది. ఇది శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. చలికాలంలో నల్లద్రాక్ష తీసుకోవటం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.

నల్ల ద్రాక్షలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. నల్లద్రాక్షని ఎండబెట్టి తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రణ ఉంటుంది. రాత్రి పూట ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఆ నీటిని, ద్రాక్షలను తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రమవుతుంది. వీటిని రాత్రి మొత్తం నీటిలో నానబెట్టడం ద్వారా వాటి ఆరోగ్య ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయి ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం అధికంగా ఉంటుంది.

రుతుస్రావం స‌మ‌యంలో నొప్పిని త‌గ్గించ‌డంలో కూడా న‌ల్ల ద్రాక్ష స‌హాయ‌ప‌డుతుంది. ఎండుద్రాక్షలో అధిక పొటాషియం స్థాయి రక్తం నుంచి సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది. నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నల్ల ఎండుద్రాక్షలో చాలా కాల్షియం ఉంటుంది. ఎముకలకు మేలు చేస్తుంది. చలికాలంలో జుట్టు పొడిబారడం, చిట్లిపోవటం వంటి సమస్యలను నిరోధిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఐరన్‌ అధికంగా ఉన్న నల్ల ఎండుద్రాక్షలను తీసుకోవటం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.