Corn Flakes : ఉదయం అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్ తీసుకుంటున్నారా? అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త

కార్న్ ఫ్లేక్స్‌లో మొక్కజొన్న, షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తదితర పదార్థాలుంటాయి. నిజానికి ఇవన్నీ హై గ్లెసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగేలా చేస్తాయి. తద్వారా ఇన్సులిన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది.

Corn Flakes : ఉదయం అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్ తీసుకుంటున్నారా? అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త

corn flakes

Corn Flakes : ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయం వేళ అల్పాహారంగా పోషకాలతో కూడిన ఆహారానికి బదులుగా ప్యాక్డ్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. సులభమార్గంలో అల్పాహారాన్ని ముగించే ప్రయత్నంలో తాము ఏమి తింటున్నామో అన్న విషయంపై ఏమాత్రం శ్రద్ధ పెట్టటంలేదు. ఇదే తరహా ఆహారాన్ని ఎదిగే పిల్లలకు అందిస్తూ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా ఉదయం అల్పాహారంగా ఇటీవలి కాలంలో కార్న్ ఫ్లేక్స్ తీసుకోవటం చాలా మంది ఇళ్లల్లో చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి బ్రేక్ ఫాస్ట్ గా కార్న్ ఫ్లేక్స్ తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

కార్న్ ఫ్లేక్స్‌లో మొక్కజొన్న, షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తదితర పదార్థాలుంటాయి. నిజానికి ఇవన్నీ హై గ్లెసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగేలా చేస్తాయి. తద్వారా ఇన్సులిన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది. దీని ప్రభావం వల్ల మెదడు కొంత సేపు మద్దుబారినట్లు అయిపోతుంది. చురుగ్గా ఉండలేరు.

అలాగే కార్న్ ఫ్లేక్స్‌ను తినడం డయాబెటిస్ పేషెంట్లకు ఎంత మాత్రం మంచిది కాదు. రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఫ్యాట్, చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. కార్న్ ఫ్లేక్స్ తయారీలో వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మన శరీరానికి మంచిది కాదు. శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తాయి.

గుండె సమస్య, ఊబకాయం, మరియు డయాబెటిస్ తో బాధ పడే వారు ఈ కార్న్ ఫ్లేక్స్ ని ఆహరంలో తీసుకోకపోవడమే మంచిది. అందులో కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయి. అధిక బరువు సమస్యను తెచ్చి పెడతాయి. కార్న్‌ఫ్లేక్స్ కొన్ని తీసుకుని వాటిల్లో కొన్ని పాలు పోసి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటుంటారు. దీనికి తోడు దంత క్షయం, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక కార్న్‌ఫ్లేక్స్‌ను తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.