Fish Eggs : చేప గుడ్లు తింటే గుండె సంబంధిత వ్యాధులు రావా!..

చేప జనను చాలా మంది అదేదో తినకూడని పదార్ధంగా చూస్తుంటారు. కాని అందులో శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపల కూర వండినట్లుగానే ఈ చేపల

Fish Eggs : చేప గుడ్లు తింటే గుండె సంబంధిత వ్యాధులు రావా!..

Fish

Fish Eggs : చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తెల్లని కండరాలతో విటమిన్ ఎ,డి,ఇలతోపాటు, బలవర్ధకమైన కొవ్వు పదార్ధాలను చేపలు కలిగి ఉంటాయి. వీటిల్లో 18 నుండి 20శాతం వరకు మాంసకృత్తులు ఉంటాయి. త్వరగా జీర్ణం అవ్వటంతోపాటు శరీరానికి అవసరమైన ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు వీటిని తినటం ద్వారా లభిస్తాయి. చేపల సంగతి అటుంచితే చేపలు గుడ్ల దశలో ఉన్నప్పుడు కడుపులో పెద్ద సంఖ్యలో గుడ్లు ఉంటాయి. ఒక్కోసారి మనం చేపలను కొనుగోలు చేసేందుకు మార్కెట్ కు వెళితే చేపలు కొనుగోలు చేసి వాటిని ముక్కలుగా కట్ చేయిస్తాం. ఆసమయంలో చేప కడుపులో నుండి చిన్నచిన్నగుడ్లతో కూడినది బయటకు వస్తుంది. దానిని జన అని అంటారు. అయితే ఈ జనను చాలా మంది తమకు వద్దని తీసేయమని చెబుతుంటారు. వాస్తవానికి చేప జనను తినటం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

చేప జనను చాలా మంది అదేదో తినకూడని పదార్ధంగా చూస్తుంటారు. కాని అందులో శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపల కూర వండినట్లుగానే ఈ చేపల జనను వండుకుని తినవచ్చు. చేప గుడ్లలో విటమిన్ A ఉంటుంది. ఈ విటమిన్  కంటి చూపును కాపాడటంలో ఎంతగానో తోడ్ప‌డుతుంది. కళ్లకు ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. రెగ్యులర్‌గా చేప గుడ్లు తింటే మీ రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి చేపగుడ్లు తినటం వల్ల రక్తశాతం త్వరితగతిన పెరుగుతుంది.

రెగ్యుల‌ర్‌గా చేప‌గుడ్ల‌ను ఆహారంలో తీసుకుంటే బీపీ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది. చేప గుడ్లలో విటమిన్ D కూడా ఉంటుంది. ఇది మీ ఎముకలు, దంతాలను బలంగా దృఢంగా మారుస్తుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. మతిమరపు స‌మ‌స్య‌ ఉన్నవారు, అల్జీమర్స్ పేషెంట్లు కూడా క్ర‌మం తప్పకుండా చేప గుడ్లను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ర‌క్త‌పోటు స‌మ‌స్య ఉన్న‌వారికి కూడా చేప గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. బీపిని తగ్గించేందుకు ఉపకరిస్తాయి. చేపగుడ్లను కూర రూపంలోకాని , ప్రై రూపంలో కాని చేసుకుని తిన వచ్చు.