Lose Weight : బరువు తగ్గడానికి సీ ఫుడ్ తింటున్నారా? ఈ మూడు తప్పులు చేయకండి!

వేయించిన ఆహారాలు చాలా రుచిగా ఉంటాయి, అయితే బరువు తగ్గించుకోవాలని , అదనపు కేలరీలను దూరంగా ఉండాలనుకునేవారు తక్కువ కేలరీలు కలిగిన చేప లేదా మరేదైనా సీఫుడ్ ను నూనెలో వేయించుకుని తినటం మాత్రం నివారించండి.

Lose Weight : బరువు తగ్గడానికి సీ ఫుడ్ తింటున్నారా? ఈ మూడు తప్పులు చేయకండి!

Seafood

Lose Weight : ఇటీవలి కాలంలో అధిక బరువు చాలా మందిలో ప్రధాన సమస్యగా మారింది. బరువును తగ్గించుకునేందుకు వివిధ రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. బరువు తగ్గడం అనేది చెప్పుకునేంత ఈజీ కాకపోయినప్పటికీ కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి అనేక రకాల ప్రయత్నాలు మాత్రం చేస్తుంటారు.

బరువును తగ్గించుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు, ఆరోగ్యకరమైన, శుభ్రమైన , సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ప్రజలు రుచిలేని, శుభ్రతలేని ఆహారాలను తీసుకుంటూ ఆరోగ్యానికి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండి రుచికరమైనవి చెప్పబడే ఆహారాలలో సీఫుడ్ కూడా ఒకటి. తక్కువ కేలరీలు , లీన్ ప్రొటీన్‌లు సీ ఫుడ్ లో ఎక్కువగా ఉంటాయి, చేపలు, షెల్ఫిష్, స్కాలోప్స్ మత్స్య ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనవని, బరువును తగ్గిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

చేపలు లీన్ ప్రోటీన్ యొక్క గొప్ప మూలం, ఇది మీ రుచికరమైన కోరికలను తీర్చడంలో సహాయపడుతుంది. పొట్టను ఎక్కువ సమయం నిండుగా ఉంచుతుంది. సాల్మన్, ట్రౌట్ లేదా ట్యూనా వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. అనారోగ్య కోరికలను దూరంగా ఉంచుతాయి. ఇతర లీన్ మాంసం కంటే చేపలు ఇతర సీఫుడ్ ఎంచుకోవడం ద్వారా, కొవ్వు తీసుకోవడాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. తక్కువ కేలరీలను కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే బరువు తగ్గడం కోసం సీఫుడ్‌ను వండే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి గురించి తప్పని సరిగా తెలుకోవాల్సి న అవసరం ఉంది. వెన్న ఏదైనా వంటకం రుచిని పెంచుతుంది. అయితే వెన్నను ఎక్కువ మొత్తంలో సీ ఫుడ్ వండే సమయంలో వినియోగించటం వల్ల బరువు పెంచే అవకాశాలు ఉంటాయి.. వెన్నకు బదులుగా పచ్చి ఆలివ్ నూనెను ఉపయోగించటం, మూలికలు, సుగంధ ద్రవ్యాలు,సిట్రస్ వంటి ఫ్లేవర్ బూస్టర్‌లను జోడించటం మంచిది.

వేయించిన ఆహారాలు చాలా రుచిగా ఉంటాయి, అయితే బరువు తగ్గించుకోవాలని , అదనపు కేలరీలను దూరంగా ఉండాలనుకునేవారు తక్కువ కేలరీలు కలిగిన చేప లేదా మరేదైనా సీఫుడ్ ను నూనెలో వేయించుకుని తినటం మాత్రం నివారించండి. ఇలా చేయటం అన్నది మీ ఫిట్‌నెస్ లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. సముద్రపు ఆహారాన్ని తీసుకోవాలనుకుంటే బేకింగ్, బ్రేజింగ్, గ్రిల్లింగ్‌ను వంటి పద్దతులను ఆశ్రయించటం మంచిది.

సాల్మన్, ట్యూనా, మాకేరెల్ ,హెర్రింగ్ వంటి కొవ్వు చేపలలో కొంత మొత్తంలో కేలరీలు ఉన్నప్పటికీ, చాలా మంది దీనిని ఉత్తమైన ఆహారంగా భావిస్తారు. నిపుణులు సైతం బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి ఇది మంచిదని నమ్ముతారు. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ తినాలన్న కోరికను అరికడుతుంది. ఇంకా ఇది  గుండె, మెదడుకు ఉపయోగకరంగా ఉంటుంది.