Steamed Foods : ఆవిరితో ఉడికించిన ఆహారాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటంతోపాటు అనేక ప్రయోజనాలు!

ఆవిరి వంటకు నూనె అవసరం లేదు. చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఇలాంటి ఆహారాలు బరువుతోపాటుగా, అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి.

Steamed Foods : ఆవిరితో ఉడికించిన ఆహారాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటంతోపాటు అనేక ప్రయోజనాలు!

HEALTH BENEFITS OF STEAMED FOODS

Steamed Foods : మనం వండడానికి ఉపయోగించే అనేక సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఆవిరిపై ఉడికించటం అన్నది చాలా ఆరోగ్యకరమైన ఎంపికని నిపుణులు చెబుతూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఆవిరితో తయారుచేసుకున్న ఫుడ్స్ లో కేలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆవిరితో వంట చేయడం వల్ల కూరగాయల ఫైబర్, రంగు, ఆకృతి మరియు రుచిని సంరక్షించడంలో సహాయపడుతుంది. నీటిలో కరిగే బి, సి విటమిన్లు, పొటాషియం, ఫాస్ఫరస్ & జింక్‌లను సంరక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది, తద్వారా ఉడికించిన కూరగాయల నుండి ముఖ్యమైన పోషకాలను పొందవచ్చు. తాజా కూరగాయలలో ఉండే 90% యాంటీఆక్సిడెంట్లను స్టీమింగ్ వల్ల పదిలంగా ఉంటాయి.

ఆవిరి వంటకు నూనె అవసరం లేదు. చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఇలాంటి ఆహారాలు బరువుతోపాటుగా, అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. బ్రోకలీ, కాలీఫ్లవర్ మరియు క్యాబేజీతో సహా అనేక కూరగాయలలో గ్లూకోసినోలేట్స్ అని పిలువబడే క్యాన్సర్ నిరోధక భాగాలు ఉన్నాయి, ఇవి ఎక్కువగా వండినప్పుడు నాశనం అవుతాయి. తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని ఆవిరి చేయడం ద్వారా, వాటి అద్భుతమైన సమ్మేళనాలు అలాగే ఉంటాయి. ఆవిరి పట్టిన ఆహారాల్లో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు, పండ్లు తేలికగా జీర్ణం అవుతాయి. ఆవిరిలో వండిని ఆహారాలు చాలా మృదువుగా తయారవుతాయి.

చికెన్ & చేపలు వంటి మాంసాలను వండేటప్పుడు, ఆవిరి ప్రక్రియ మాంసం నుండి మొత్తం కొవ్వును తొలగిస్తుంది. అయితే గ్రిల్లింగ్, బేకింగ్ లేదా ఫ్రైయింగ్ వంటి సంప్రదాయ వంట పద్ధతులు మాంసంలోకి కొవ్వును పంపుతాయి. కొవ్వును వదిలించుకోవడం వల్ల మాంసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఆవిరితో వండితే వాటిలో ఉండే ఖనిజాలు, పోషకాలు ఎటూ పోవు. ఆవిరిలో ఉడికించడం వల్ల నియాసిన్, విటమిన్ బి, థయామిన్, విటమిన్ సి వంటివి మన శక్తిని మరింత పెంచుతాయి. ఆవిరితో వండిన ఆహారాలను తినడం వల్ల వాటిలో ఉండే పూర్తి పోషకాలు అందుతాయి. అయితే ఆవిరితో వండిన వంటలు మరింత రుచిగా ఉండాలంటే రకాల మసాలా దినుసులను వాటికి చేర్చుకోవచ్చు