Heart : ఈ ఆహారాలు తింటే మీ గుండె సేఫ్!

రోజూ కనీసం నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం తగ్గుతుందని పరిశోదనలు చెబుతున్నాయి.

Heart : ఈ ఆహారాలు తింటే మీ గుండె సేఫ్!

Safe For Your Heart

Heart : గుండె జబ్బులు రావొద్దంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. సరైన సమయంలో తినడం, ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటివి ఉండేలా చూసుకోవటం అవసరం. ముఖ్యంగా గుండె జబ్టులు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి. దీనివల్ల హార్ట్‌ఎటాక్‌ రిస్క్ తగ్గుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

గుండె సురక్షితంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఒమేగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉండే అవిసె గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. గుండె చుట్టు పక్కల అనవసర కొవ్వు పేరుకుపోకుండా చేయటంలో టమోటాలు బాగా ఉపకరిస్తాయి. లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువ, క్యాలరీలు టమోటాల్లో తక్కువగా ఉంటాయి. రోజుకి ఒక్క బైట్‌ చొప్పున డార్క్ చాక్లెట్ తినడం అలవాటు చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు.

రోజూ కనీసం నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు 20 శాతం తగ్గుతుందని పరిశోదనలు చెబుతున్నాయి. ఓట్స్ ను ఆహారంలోబాగం చేసుకోవటం వల్ల బరువు తగ్గటంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికీ ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పీచుపదార్థం శరీరంలోని కొవ్వును గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో కొవ్వు స్థాయి తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

సోయా పాలు గుండె సురక్షితంగా ఉండేలా చేస్తాయి. ఈ పాలల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం, ప్రొటీన్లు శరీరంలో ఉండే అనవసర కొవ్వును తగ్గిస్తాయి. రోజూ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం దాదాపు 15శాతం తగ్గుతుంది. పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల గుండె సురక్షితంగా ఉంటుంది. కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్‌ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు అవి దోహదపడతాయి.

బఠాణీ, పప్పులు, కాయధాన్యాలు.. వీటిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని వారానికి కనీసం నాలుగు సార్లు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 20 శాతానికి పైగా తక్కువగా ఉంటుంది. బంగాళదుంపల్లో ఉండే పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే పీచుపదార్థం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగని బంగాళదుంపల అయిల్ ఫ్రై వంటి వాటిని తీసుకోకుండా పులుసు కూరగా తీసుకోవటం మంచిది.