Eating With Hands : స్పూన్ తో ఆహారం తీసుకుంటున్నారా? చేతితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే?

మన చేతులు, కడుపు, పేగులు కొన్ని మంచి బ్యాక్టీరియాలకు నిలయంగా ఉంటాయి. ఇవి వ్యాధుల నుంచి కాపాడతాయి. చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉండేందుకు అవకాశం ఉంటుంది.

Eating With Hands : స్పూన్ తో ఆహారం తీసుకుంటున్నారా? చేతితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు  తెలిస్తే?

Eating With Hands :

Eating With Hands : బిజీ లైఫ్‌లో యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి అందరూ కొత్తకొత్త పద్దతులను అనుసరిస్తున్నారు. తీసుకునే ఆహారం విషయంలోను కొత్త పోకడులు పోతున్నారు. ఒకప్పుడు ఆహారాన్ని చేతితో తీసుకుని తినే వారు ప్రస్తుతం కాలం మారిపోయింది. అంతా స్పూనులతో తినేస్తున్నారు. అయితే చేతితో ఆహారాన్ని తినటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయి. ఆహారాన్ని చేయి తాకగానే ఙ్ఞాన‌ నాడుల ద్వారా మెదడు, పొట్టకు సంకేతాలు చేరుతాయి. దీని వల్ల జీర్ణరసాలు, ఎంజైములు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. స్పూన్‌తో అతిగా, వేగంగా తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. చివరకు అది డయాబెటిస్‌కు దారితీస్తుంది.

మన చేతులు, కడుపు, పేగులు కొన్ని మంచి బ్యాక్టీరియాలకు నిలయంగా ఉంటాయి. ఇవి వ్యాధుల నుంచి కాపాడతాయి. చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆహారాన్ని వండేటప్పుడు నూనెతోపాటు ఇతర పదార్థాలను సమపాళ్లలో వేస్తారు. అయితే స్పూన్ లేదా ఫోర్క్స్‌తో తినడం వల్ల ప్రతిచర్య జరిగి వాటి రుచి దెబ్బతింటుంది. చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. భోజనం కోసం కూర్చునే ముందు మీరు తప్పకుండా సబ్బు, హ్యాండ్‌వాష్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతితో తినటం వల్ల వ్యాయామంగా కూడా ఉంటుంది.