Breast Cancer : మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ రాకుండా కాపాడే గుడ్డు!

3,000 వేలమందికి పైగా వయోజన మహిళలపై ఈ అధ్యయనం నిర్వహించగా వీరిలో గుడ్డు తక్కువ తీసుకుంటున్న మహిళలతో పోలిస్తే , అత్యధికంగా తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 24 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

Breast Cancer : మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ రాకుండా కాపాడే గుడ్డు!
ad

Breast Cancer : ఎన్నో పోషక విలువలున్న ఆహారంగా గుడ్డును చెప్పవచ్చు. ఎంతో రుచికరంగా ఉండటంతోపాటు సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. తక్కువ కేలరీలతో పాటు మంచి ప్రొటీన్స్ ను గుడ్డు తీసుకోవటం ద్వారా శరీరానికి లభిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం గుడ్ల వంటి ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 24 శాతం తగ్గించాయని పేర్కొన్నారు. 3,000 వేలమందికి పైగా వయోజన మహిళలపై ఈ అధ్యయనం నిర్వహించగా వీరిలో గుడ్డు తక్కువ తీసుకుంటున్న మహిళలతో పోలిస్తే , అత్యధికంగా తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 24 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం ఇందులో ఉండే కోలిన్ అనే న్యూట్రిషియన్ కారణమని తేల్చారు.

కోలిన్ ఎక్కువగా తీసుకునే స్త్రీలు రోజువారీ సగటున 455 mg కోలిన్ లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటారు, కాఫీ, గుడ్లు మరియు పాలు నుండి ఎక్కువ భాగం తీసుకుంటారు. అత్యల్పంగా తీసుకునే మహిళలు రోజువారీ సగటు 196 మిల్లీగ్రాములు లేదా అంతకంటే తక్కువ. వయస్సుతో సంబంధం లేకుండా కణాల సాధారణ పనితీరుకు కోలిన్ అవసరం. మహిళలకు, ముఖ్యంగా పిల్లలను కనే వయస్సులో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైనదని అధ్యయనాలు చూచిస్తున్నాయి.

గుడ్లు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయ్ :

గతంలో ప్రచురించిన రెండు అధ్యయనాల్లో గుడ్లు తినే స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 2003లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కౌమారదశలో గుడ్లు, కూరగాయల కొవ్వులు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే పెద్దవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పేర్కొంది. ప్రత్యేకంగా, రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18 శాతం తగ్గుతుంది. 2005లో క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ & ప్రివెన్షన్‌లో ప్రచురించబడిన చైనీస్ మహిళల అధ్యయనంలో పండ్లు, కూరగాయలు, గుడ్లు ఎక్కువగా తీసుకునే వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని తేలింది. వారానికి కనీసం ఆరు గుడ్లు తిన్నట్లు నివేదించిన వారికి, వారానికి రెండు లేదా అంతకంటే తక్కువ గుడ్లు తినే వారి కంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 44 శాతం తక్కువగా ఉంది.

గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. నరాల బలహీనత తగ్గేలా చేయటంతోపాటు గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది.