చెడు జ్ఞాపకాలను మర్చిపోవడం అంతసులువుకాదు. కాకపోతే సైన్స్ సాయం చేస్తానంటోంది!

చెడు జ్ఞాపకాలను మర్చిపోవడం అంతసులువుకాదు. కాకపోతే సైన్స్ సాయం చేస్తానంటోంది!

తీపి జ్ఞాపకాలు.. ఎంతో మదురంగా ఉంటాయి. గుర్తొచ్చినప్పుడల్లా ఆనందంగా అనిపిస్తుంటుంది.. అదే చెదు జ్ఞాపకాల జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. మనస్సును గాయపర్చేలా అనిపిస్తుంటాయి. మంచి జ్ఞాపకాలను మరిచిపోయినంత తొందరగా చెడు జ్ఞాపకాలను మరిచిపోలేమంటారు.

ఇప్పుడు అదే అంటోంది సైన్స్.. కానీ, మనస్సును గాయపరిచే అలాంటి చెడు జ్ఞాపకాలను మాత్రం మరిచిపోవడానికి సాయం చేస్తానంటోంది. అదేలా అంటారా? ‘Eternal Sunshine of the Spotless Mind’ మీకు గుర్తుందా? బాధతో విడిపోయిన ఇద్దరు ప్రేమికులు వారి మధ్య బంధానికి సంబంధించి జ్ఞాపకశక్తిని చెరిపివేస్తారు.

కానీ మళ్ళీ ప్రేమలో పడతారు. బాధాకరమైన లేదా బాధాకరమైన జ్ఞాపకాలను కూడా చెరిపివేయగలిగితే అది గొప్ప విషయమే కదా అంటోంది సైన్స్.. మీ మనస్సులో బాధను తగ్గించే విషయాలను ఓసారి ఊహించుకోండి. అసలు చెదు జ్ఞాపకాలను మరిచిపోవడం సాధ్యమేనా? అంటే.. ఇప్పుడే ఇదే విషయంపై న్యూరో సైంటిస్టులు, మనస్తత్వవేత్తలు కూడా పరిశీలిస్తున్నారంట.. మెదడులోని భావోద్వేగ జ్ఞాపకాలను మరిచిపోవాలంటే ముందుగా సంతోషకరమైన క్షణాలను గుర్తుచేసుకుంటుండాలి.
Erasing Memories Mightఏదైనా బాధకరమైన ఘటన చూసినప్పుడల్లా గతంలో జరిగిన బాధాకరమైన సంఘటన వెంటనే గుర్తుకు రావడం సహజమే. ఇలాంటి సమయాల్లో జ్ఞాపకాలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంటున్నారు సైంటిస్టులు.. నిర్దిష్ట ల్యాబరేటరి పద్ధతులతో జ్ఞాపకాలను శాశ్వతంగా మార్చడానికి అవకాశాన్ని కల్పిస్తుందని అంటున్నారు. సంతోషకరమైన క్షణాలతో చేదు జ్ఞాపకాలను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. వాస్తవానికి, ఈ అంశంపై ఒక ప్రాథమిక అధ్యయనం కూడా జరిగిందంట.

ప్రపంచ ప్రఖ్యాత న్యూరో సైంటిస్టుల బృందం నేచర్ అనే జనరల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. బెల్జియం సైకాలిజిస్ట్.. Tom Beckers ఈ అంశంపై పరిశోధన ప్రారంభించినట్టు తెలిపారు. 4 ఏళ్ల శ్రమతో బెకర్స్ అతని బృందం దీనిపై పరిశోధన చేసింది.

ఈ కొత్త అధ్యయనంలో అసలు ఫలితాలపై వైఫల్యాన్ని నివేదించింది. శాస్త్రవేత్తల్లో ఇప్పుడు ఓపెన్ సైన్స్ పైనే ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు. సైన్స్ అనేది హ్యుమన్ యాక్టివిటీగా చెబుతున్నారు. అందుకే ఇది లోపభూయిష్టంగా ఉంటుంది. అయితే ఈ లోపాలను విజ్ఞాన శాస్త్రాన్ని బహిరంగంగా సహకారంగా మార్చడం ద్వారా అధిగమించవచ్చునని అంటున్నారు. చేదు జ్ఞాపకాలను చెరిపివేయడానికి ఇదో అవకాశమని చెప్పవచ్చు.