Overweight : పెరిగే ప్రతి కిలో బరువూ మృత్యువు వైపు అడుగే! అధిక బరువుతో గుండె జబ్బుల ప్రమాదం?

చాలా కారకాలు గుండె ఆగిపోవడానికి కారణమవుతాయి, ఊబకాయం సైతం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు కారణంగా 2030 నాటికి, ప్రతి ఐదుగురిలో ఒకరికి గుండె పోటు ముప్పు ఉంటుందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి.

Overweight : పెరిగే ప్రతి కిలో బరువూ మృత్యువు వైపు అడుగే! అధిక బరువుతో గుండె జబ్బుల ప్రమాదం?

obesity DiabCardio Disease

Overweight : అధిక బరువు సమస్య గుండె జబ్బులకు దారితీసే ముప్పును తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే క్రమంలో అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు దారితీస్తుంది. అధిక బరువు కారణంగా గుండె కండరాలపై వత్తిడి పెరుగుతుంది. అధిక రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్ , మధుమేహంతో సంబంధం లేకుండా గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. పెరిగే ప్రతి కిలో బరువూ మృత్యువు దిశగా మిమ్మల్ని అడుగులేసేలా చేస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం , కొలెస్ట్రాల్‌ ఈ మూడింటికీ ప్రధాన కారణం బరువు పెరగడమే. ఒక వ్యక్తి ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటమే ఊబకాయం. దీనికి మధుమేహం,అధిక రక్తపోటు ప్రారంభ దశగా భావించాలి. సాధారణంగా బరువు ఒకేసారి పెరగరు. క్రమేపి బరువు పెరిగే క్రమం ఉంటుంది. తొలిదశలోనే దానిని నియంత్రించడం ఉత్తమం.

బరువుతో గుండె వైఫల్యానికి లింకేంటి ;

చాలా కారకాలు గుండె ఆగిపోవడానికి కారణమవుతాయి, ఊబకాయం సైతం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు కారణంగా 2030 నాటికి, ప్రతి ఐదుగురిలో ఒకరికి గుండె పోటు ముప్పు ఉంటుందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం , కొలెస్ట్రాల్ వంటి లేకపోయినప్పటికీ , ఊబకాయం వల్ల గుండె వైఫల్యానికి దారితీస్తుందని పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. గాయపడిన గుండె కండరాల కణాలు ట్రోపోనిన్ T అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తాయి. ఎవరికైనా గుండెపోటు ఉందని అనుమానించినప్పుడు వైద్యులు దీనిని రక్తంలో కొలుస్తారు. అధిక బరువు అధిక ట్రోపోనిన్ స్థాయిలతో బలంగా ముడిపడి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఊబకాయం మరియు అధిక ట్రోపోనిన్ స్థాయిలు ఉన్నవారు సాధారణ బరువు, గుర్తించలేని ట్రోపోనిన్ ఉన్నవారి కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ గుండె ఆగిపోయే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ హార్ట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో నివేదించారు.

అధిక బరువు కలిగి ఉండటం కూడా అధిక ప్రమాదంలో పడవేస్తుంది. మధుమేహం, రక్తపోటు లేనప్పుడు అటు రోగులు, ఇటు వైద్యులు అంతాబాగానే ఉందని అనుకుంటారు. కానీ నిశ్శబ్దంగా గుండెకు గాయం జరిగే ప్రమాదం ముంచుకురావచ్చు. అదనపు బరువు కారణంగానే ఈ పరిణామాం తలెత్తుతుంది. గుండె వైఫల్యాన్ని తగ్గించడానికి బరువు తగ్గటం ఒక్కటే మార్గం. ఊబకాయం సమస్యతో బాధపడుతున్నవారు గుండె వైఫల్యం సంకేతాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలసట, శ్వాస ఆడకపోవడం, సక్రమంగా లేని హృదయ స్పందన విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. సరైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా బరువును తగ్గించుకోవటంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.