Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..

జీవక్రియ అసమతుల్యతతో ఉంటుంది. శరీరానికి తగినంత శక్తి రాదు. ఇది అలసటకు కారణమవుతుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. మీరు ఉదయం లేచినప్పుడు, జీవక్రియ తక్కువగా ఉంటుంది. అల్పాహారం చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

Breakfast : ఉదయం లేచి అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఉరుకుల పరుగుల జీవితం లేదా పని అలవాట్లను పనిలో ఉండటం… ఇతర కారణాల వల్ల తినడం మానేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యంపై అనేక దుష్పప్రభావాలు చూపుతాయి. ఆధునిక కాలంలో చాలా వరకు జీవన శైలీ మారిపోయింది. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కోని ఉండడం.. ఉదయాన్నే లేట్ గా లేవడం.. బ్రేక్ ఫాస్ట్ తినకుండా.. నేరుగా లంచ్ చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఉదయం అల్పాహారం చేసే సమయంలో చిరుతిళ్లు తినడం.. ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ తాగడం చేస్తుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసిన వారిలో అనేక సమస్యలు వస్తుంటాయి.

అల్పాహారం తీసుకోకపోతే.. చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇది సమస్యలను కలిగిస్తుంది. అల్పాహారం చేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం, ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల నియంత్రణతో ఉబకాయం వంటి సమస్యలు వస్తాయి. ఆ తర్వాత గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. రోజులో ఉదయం బ్రేక్ ఫాస్ట్ వల్ల ఫైబర్ , విటమిన్లతో సహా మీ ఆహారంలో అధిక పోషకాలను పొందడానికి అవకాశం ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపులో నొప్పి రావడానికి కారణం అయ్యే అవకాశం ఉంది.

జీవక్రియ అసమతుల్యతతో ఉంటుంది. శరీరానికి తగినంత శక్తి రాదు. ఇది అలసటకు కారణమవుతుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. మీరు ఉదయం లేచినప్పుడు, జీవక్రియ తక్కువగా ఉంటుంది. అల్పాహారం చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీనివల్ల ఆకలి, కోపం వస్తుంది. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది.శరీరం ఆకలితో ఉన్నప్పుడు శక్తి అవసరమైనప్పుడు, కడుపులో ఏమీ లేనప్పుడు యాసిడ్స్ విడుదల అవుతాయి. ఇది మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అల్పాహారం తీసుకోని వారిలో పోషకాలు లోపిస్తుంటాయని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అధ్యయనంలో వెల్లడైంది.

ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అల్పాహారంగా ఇడ్లీ, చపాతీ, పూరీ, దోసే వంటి పదార్థాలు తీసుకోడం మేలు.. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒకవేళ ఇవి తినాలని లేని వారు.. మొలకెత్తిన విత్తనాలు.. ఉడికించిన కొడిగుడ్లు, నూనె లేకుండా చాపతీలు, పండ్ల రసాలు, ఐదు నానబెట్టిన బాదం పప్పులు, పండ్లు, కూరగాయలతో కలిపి సలాడ్స్ తీసుకోవాలి. ఇవి అనారోగ్య కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి. అల్పాహారంలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు