COVID-19: కొవిడ్‌పై పోరాటంలో ఎఫెక్టివ్‌గా వారానికి 150నిమిషాల ఎక్సర్‌సైజ్

హార్వార్డ్ హెల్త్ పబ్లిషింగ్స్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. కొవిడ్ పై పోరాటంలో వారానికి కనీసం 150నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయడం మంచిదని చెబుతుంది. ఎక్సర్‌సైజ్ అనేది శరీరాన్ని కొవిడ్ నుంచి పోరాటానికి హెల్ప్ అవుతుందా అనే అంశంపై ..

COVID-19: కొవిడ్‌పై పోరాటంలో ఎఫెక్టివ్‌గా వారానికి 150నిమిషాల ఎక్సర్‌సైజ్

COVID-19: హార్వార్డ్ హెల్త్ పబ్లిషింగ్స్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. కొవిడ్ పై పోరాటంలో వారానికి కనీసం 150నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయడం మంచిదని చెబుతుంది. ఎక్సర్‌సైజ్ అనేది శరీరాన్ని కొవిడ్ నుంచి పోరాటానికి హెల్ప్ అవుతుందా అనే అంశంపై ఎమ్జీహెచ్ డీజీఎం హెల్తీ లైఫ్‌స్టైల్ ప్రోగ్రాం రీసెర్చ్ అండ్ అకడమిక్ అఫైర్స్ డైరక్టర్ డా.టెలో వ్యాసం రాశారు.

లైఫ్ స్టైల్ లో మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు మీ గుండెను కాపాడతాయని వివరించారు. రోజూ కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయడం కీలక మార్పులే చేస్తుంది. శరీరంలో దృఢత్వం, కండరాలు మెరగవడం, శరీరంలో పలు అవయవాలు ఫిట్ గా ఉండటం వల్ల చాలా వ్యాధులు వ్యాపించడం తగ్గుతుందట. వాటిల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, డెమెన్షియాలు కూడా ఉంటాయని అందులో పేర్కొన్నారు.

రోజుకు కనీసం 150నిమిషాల పాటు చేసే ఎక్సర్‌సైజ్ తో సమస్యలన్నీ తగ్గిపోతాయి. చాలా మంది ఎక్సర్‌సైజ్ అంటేనే వాయిదాలు వేస్తూ ఉంటారు. నిజానికి తెలుసుకోవాల్సిందేంటంటే.. వాయిదాలు మనం వేస్తాం కానీ జబ్బులు కాదు. ఈ విషయాన్ని పరిశీలించడానికి దాదాపు 48వేల 440 మంది వ్యక్తులపై స్టడీ నిర్వహించారు.

వారందరిలోనూ ఎక్సర్ సైజ్ చేయనివారిలోనే కొవిడ్ లక్షణాలు కానీ, కొవిడ్ వల్ల ఆరోగ్య సమస్యలు కానీ ఎక్కువగా వచ్చాయి.