Exercise : రోజువారిగా కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారా? వారంలో ఒకరోజు వ్యాయామాలకు విరామం ఇవ్వండి!

వ్యాయామం చేసేటప్పుడు సురక్షితంగా ఉండటానికి ఒకరోజు విశ్రాంతి అవసరం. శరీరం ఎక్కువగా పనిచేసినప్పుడు పడిపోయే అవకాశం ఉంది, బరువు తగ్గవచ్చు , తప్పుగా అడుగులు వేయవచ్చు. ఓవర్‌ వ్యాయామం కండరాలను ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది మితిమీరిన గాయాల ప్రమాదాన్ని పెంచుతుంది.

Exercise : రోజువారిగా కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారా? వారంలో ఒకరోజు వ్యాయామాలకు విరామం ఇవ్వండి!

Exercising hard on a daily basis? Give exercise a break one day a week!

Exercise : ఆరోగ్యంగా , రోజువారి కార్యకలాపాల్లో చురుకుగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామాలు చేయమని నిపుణులు చెబుతుంటారు. దీంతో చాలా మంది రోజు వారి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. రోజువారి వ్యాయమం చేసే వారు వారానికి ఒక రోజు బ్రేక్ తీసుకోవటం వల్ల శరీరం కోలుకోవటానికి, రిపేర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అయితే కొంద‌రు అధిక బ‌రువు త‌గ్గ‌డం కోసం నిత్యం భారీ ఎత్తున వ్యాయామం చేస్తుంటారు. నిజానికి అలా చేయ‌కూడ‌ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాటే వారంలో 6 రోజులు వ్యాయామం చేస్తే చాల‌ని, ఒక్క రోజు విరామం ఇవ్వాల‌ని సూచిస్తున్నారు.

వారంలో ఒక రోజు వ్యాయామానికి గ్యాప్ ఇవ్వటం వల్ల ప్రయోజనాలు ;

వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వ‌డం వ‌ల్ల శ‌రీరం క‌ణ‌జాలానికి మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. ప్రత్యేకంగా, కండరాల పెరుగుదలకు విశ్రాంతి అవసరం. ఫలితంగా కండరాలు బలంగా ఉంటాయి. వ్యాయామాన్ని ప్ర‌తి రోజూ చేస్తే శరీర కణజాలాలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వ్యాయామం వల్ల కలిగే అలసటను నివారించడానికి విశ్రాంతి అవసరం. ఎముకలు, కండరాలపై ఒత్తిడి తగ్గేందుకు ఒక రోజు విరామం తోడ్పడుతుంది.

వ్యాయామం చేసేటప్పుడు సురక్షితంగా ఉండటానికి ఒకరోజు విశ్రాంతి అవసరం. శరీరం ఎక్కువగా పనిచేసినప్పుడు పడిపోయే అవకాశం ఉంది, బరువు తగ్గవచ్చు , తప్పుగా అడుగులు వేయవచ్చు. ఓవర్‌ వ్యాయామం కండరాలను ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది మితిమీరిన గాయాల ప్రమాదాన్ని పెంచుతుంది. వ్యాయామం నుండి విరామం తీసుకోవడం కండరాలకు మాత్రమే కాదు, మానసిక స్థితికి కూడా మేలు చేస్తుంది. తాజా అనుభూతిని కలిగిస్తుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్ అనుభూతిని కలిగిస్తుంది.

శక్తిని పెంచుతుంది మరియు అలసటను నివారిస్తుంది, ఇదిశరీరాన్ని నిలకడగా తిరిగి వ్యాయామాలకు సిద్ధం చేస్తుంది. కాబ‌ట్టి నిత్యం భారీగా వ్యాయామం చేయ‌కండి. అలాగని రోజంతా మంచానికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. తేలికపాటి నడక, గార్డెనింగ్ వంటి కార్యకలాపాల్లో పొల్గొన వచ్చు. అలాగే వారంలో ఒక రోజు వ్యాయామానికి విశ్రాంతి ఇవ్వటం వల్ల ఫిట్ గా ఉండటంతోపాటు, ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.