Threading : ఐబ్రో త్రెడింగ్…మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

త్రెడింగ్ తర్వాత నొప్పిగా అనిపించే కనుబొమ్మల దగ్గర.. కోల్డ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను రాసుకోండి. వెన్న, బాదం నూనె, ఆలివ్ నూనె వంటివి మంట, నొప్పిని తగ్గిస్తాయి. ఐస్ అప్లై చేయడం వల్ల కూడా ఈ నొప్పి, వాపు తగ్గుతాయి.

Threading : ఐబ్రో త్రెడింగ్…మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు

Eyes

Threading : మనిషి కళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోను మగువుల కళ్ల విషయానికి వస్తే చెప్పాల్సిన పనేలేదు. వాళ్ళ అందమంతా కళ్లలోనే దాగివుంటుంది. నయనాలు.. మగువ ముఖానికి నిజమైన అందాన్ని తీసుకొస్తాయి. కళ్లకు అందంగా మేకప్ వేసుకుంటే చాలు.. చాలా అందంగా కనిపిస్తుంది. అందమైన కనుబొమ్మలు ముఖ వర్చస్సును మరింత పెంచుతాయటనటంలో ఎలాంటి సందేహంలేదు. కనుబొమ్మలు ఒత్తుగా, ఒంపు తిరిగి విల్లులా కనిపించడం వల్ల.. ముఖం సైతం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

అందుకే.. ఇటీవలికాలంలో చాలా మంది మహిళలు తమ కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దేందుకు త్రెడింగ్ చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు సన్నగా నాజుగ్గా మార్చుకోవచ్చు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో త్రెడింగ్ చేసే విధానంలో అవగాహన లేకపోవటం వల్ల తప్పులు దొర్లుతున్నాయి. త్రెడింగ్ లో కనుబొమ్మలు మరీ సన్నగా అయిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

కనుబొమ్మలను అడ్జస్ట్ చేసి వాటిని అందంగా కనిపించేలా చేయడం అనేది త్రెడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. ఇది ముఖంపై ఎక్కువగా ఉన్న జుట్టును ఇది తొలగిస్తుంది. ఐబ్రో త్రెడింగ్ వల్ల వెంట్రుకల పెరుగుదల కూడా తగ్గుతుంది. కాబట్టి అందంగా కనిపించే వీలుంటుంది. ఒకసారి త్రెడింగ్ చేయించుకున్న తర్వాత.. కొన్ని నెలల పాటు దాన్ని ఎవరూ మరోసారి చేయించుకోరు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మళ్లీ బలంగా పెరుగుతాయి. కాబట్టి కనీసం నెలకోసారైనా త్రెడింగ్ చేయించుకోవడం మంచిది.

త్రెడింగ్ చేయడానికి ముందు మీ ముఖాన్ని నీటితో బాగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై ఎక్కువగా ఉన్న నూనె తొలిగిపోతుంది. నీటితో కడుక్కున్న తర్వాత.. కాటన్ వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది. మొదటిసారి త్రెడింగ్ చేయించుకున్నప్పుడు చాలామందికి కనుబొమ్మలు ఉబ్బుతాయి. ఇది వెంట్రుకలను బలంగా లాగడం వల్ల జరుగుతుంది. ఇది కొందరిలో రెండు రోజుల వరకూ నిలుస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు.

రోజూ కనుబొమ్మలకు నూనె లేదా ఆముదం రుద్ది మసాజ్ చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఒత్తుగా పెరగడం వల్ల మీ ముఖంలో అందం మరింత ఎక్కువగా పెరుగుతుంది. పొడవాటి ముఖం ఉన్నవారు కనుబొమ్మలు కాస్త పొట్టిగా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా పార్లర్ వాళ్లు పదిహేను రోజులకోసారి త్రెడింగ్ చేసుకోవాలని చెబుతుంటారు. కానీ మరీ అంత తరచుగా త్రెడింగ్ చేయించుకోవడం కూడా సరికాదు. దీనివల్ల కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతుంటాయి.

త్రెడింగ్ తర్వాత నొప్పిగా అనిపించే కనుబొమ్మల దగ్గర.. కోల్డ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను రాసుకోండి. వెన్న, బాదం నూనె, ఆలివ్ నూనె వంటివి మంట, నొప్పిని తగ్గిస్తాయి. ఐస్ అప్లై చేయడం వల్ల కూడా ఈ నొప్పి, వాపు తగ్గుతాయి. కొంతమందికి అలర్జీ, రాషెస్ వంటివి ఉంటాయి. ఇలాంటి వారు త్రెడింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

త్రెడింగ్ చేసిన తర్వాత ముఖంపై.. ఎలాంటి ట్రీట్‌మెంట్ చేయించుకోకూడదు. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం లేదా మేకప్ వేసుకోవడం వెంటనే చేయకూడదు. ఇలా చేస్తే కనుబొమ్మల దగ్గర చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. త్రెడింగ్ చేసే వారి చేతుల నుంచి మీ ముఖానికి ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకే త్రెడింగ్ లేదా ఏ బ్యూటీ ట్రీట్ మెంట్ చేసే ముందైనా బ్యూటీషియన్‌ని చేతులు బాగా కడుక్కోమని చెప్పాలి.