Face Pack : ఎండతో కమిలిన ముఖ చర్మానికి ఫేస్ ప్యాక్!

పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండ చర్మం మీద దాడి చేయకుండా రక్షించడంతోపాటు మంటను తగ్గించే తేలికైన, సమర్థవంతమైన ఔషధం ఇది.

Face Pack : ఎండతో కమిలిన ముఖ చర్మానికి ఫేస్ ప్యాక్!

Face Pack : ఎండవేడికి గురైన చర్మం మంటగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటిని సరైన సమయంలో తగ్గించుకోకపోతే ఇవి దీర్ఘ కాల సమస్యగా మారుతాయి. మచ్చలు, మెటిములు, చర్మ పొడి బారడం వంటి వాటికి చెక్ పెట్టాలంటే పుచ్చకాయ ఫేషియల్ ఎంతగానో తోడ్పడుతుంది. పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండ చర్మం మీద దాడి చేయకుండా రక్షించడంతోపాటు మంటను తగ్గించే తేలికైన, సమర్థవంతమైన ఔషధం ఇది. పుచ్చకాయతో ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తయారీ పద్ధతి వాడాల్సిన విధానం :

తాజా పుచ్చకాయను ముక్కులగా కోసి , ఎర్రటి గుజ్జు భాగం మీద నిమ్మ చెక్కను పిండి, దానిని నేరుగా ముఖం మీద ఒత్తిడి కలిగిస్తూ ప్రయోగించి , వలయాకారంగా రుద్దుకోవాలి. కొద్ది సేపు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తరువాత ముఖచర్మాన్ని చన్నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం శుభ్రపడి, తాజాగా, కడిగిన ముత్యం లాగా , కొత్త కాంతితో మెరుస్తుంది. పుచ్చకాయ ఎండబేడిమినుంచి కాపాడటమే కాకుండా , చర్మానికి మెరుపును, తేమను, బిగువును కలిగిస్తుంది. నిమ్మరసం సూర్య కిరణాలను అడ్డుకొని చర్మానికి రక్షణనిస్తుంది.

అలాగే శనగపిండి, పాలు, పుచ్చకాయ రసం తీసుకోవాలి. వీటిని మిక్స్ చేసిన తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇలా మీ ముఖంపై 15 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగండి. వారానికి ఒకసారి చేస్తే చర్మం మెరుస్తుంది.