Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!

ఓ బౌల్‌లో కరివేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు లేదా పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని కాస్తంత స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి.

Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!

Face Packs

Skin Care : చర్మం నిగారింపు సంతరించుకోవాలంటే మార్కెట్లో దొరికే క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వాడాల్సిన పనిలేదు. ఇంట్లో లభించే పసుపు, శనగపిండి, పాలు, తేనె వంటి వాటితో ముఖారవిందాన్ని పెంచుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించే కొన్ని ఫేస్ ప్యాక్ ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో ఒక అర టీస్పూన్‌ పసుపు వేసి, కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ కలిపితే మరీ మంచిది. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. బాగా ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. తేనె కూడా చర్మ నిగారింపును పెంచుతుంది. ముందుగా ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత తేనెను అప్లై చేసి మర్దన చేసుకోవాలి. కాసేపు వదిలేస్తే చర్మం తేనెను గ్రహిస్తుంది. కాసేపయ్యాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

నాలుగైదు బాదం పలుకులను పొడిగా చేసి అందులో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, రెండు చుక్కల నిమ్మరసం, కొద్దిగా పాలు పోసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ఓ బౌల్‌లో కరివేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు లేదా పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని కాస్తంత స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

శనగపిండి 2 టీస్పూన్లు తీసుకొని 2 టీస్పూన్ల కలబంద జెల్ ,టొమాటో గుజ్జును కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖమంతా అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని చల్లని నీటితో శభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా జెల్ చర్మానికి పోషణను అందిస్తుంది.