Face packs : ముఖంపై ఏర్పడే నల్లమచ్చలను తొలగించే ఫేస్ ప్యాక్స్!

మార్కెట్లో లభించే అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయినా ఏమాత్రం ఫలితం ఉండకపోను వాటిలోని కెమికల్స్ కారణంగా ముఖంపైన చర్మం మరింత దెబ్బతింటుంది. నల్లమచ్చలు తగ్గకుండా అలాగే ఉండిపోతుంటాయి

Face packs : ముఖంపై ఏర్పడే నల్లమచ్చలను తొలగించే ఫేస్ ప్యాక్స్!

Face packs

Face packs : ముఖం లేదా ముక్కుపై ఏర్పడే చిన్నచిన్న బ్లాక్ అండ్ వైట్ మచ్చలతో చాలా మంది బాధపడుతుంటారు. వాటిని తొలగించే క్రమంలో మార్కెట్లో లభించే అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయినా ఏమాత్రం ఫలితం ఉండకపోను వాటిలోని కెమికల్స్ కారణంగా ముఖంపైన చర్మం మరింత దెబ్బతింటుంది. నల్లమచ్చలు తగ్గకుండా అలాగే ఉండిపోతుంటాయి. వీటిని సహజసిద్దంగా పోగొట్టుకునేందుకు కొన్ని ఫేస్ ప్యాక్ లు బాగా ఉపకరిస్తాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

యాపిల్ ఫేస్ ప్యాక్ ;

ముందుగా ఒక యాపిల్‌ తీసుకొని దాని తొక్క చెక్కేసి, గుజ్జును మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్‌ చొప్పున బార్లీ పౌడర్‌, తేనె వేసుకొని ఈ మూడింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. క్రమం తప్పకుండా నెల రోజుల పాటు రోజూ వేసుకున్నట్లయితే నల్ల మచ్చలు తగ్గి ముఖమంతా కాంతివంతంగా మారుతుంది.

వరిపిండి, పసుపు ఫేస్ ప్యాక్ ;

ఇందుకోసం ముందుగా కొద్దిగా వరి పిండి తీసుకోండి. అందులో కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతం లో అప్లై చేయండి. 20 నిమిషాల సమయం అలాగే వదిలేయాలి. తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మెంతిపొడి, దాల్చిన పొడి ఫేస్ ప్యాక్ ;

ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలో వేయించిన మెంతులు పొడి కొద్దిగా వేసి దానిలోనే నిమ్మ రసం, తేనె కూడా యాడ్ చేసి ఈ పేస్ట్‌ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాయండి. ఆ తరువాత కొంచెం సేపు అలా వదిలేసి నీళ్లతో కడుక్కోవాలి.

వేపాకుల పేస్ట్ ;

వేపాకులను తీసుకుని నీళ్ళలో వేసి మరిగించండి. రాత్రంతా దానిని అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టేసి ఆకుల నుండి పేస్ట్ చేసుకుని దానిని ముఖం మీద మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. కాసేపు అలా వది లేసి ఆ నీళ్ళతో శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి.

టీ ట్రీ ఆయిల్ ;

టీ ట్రీ ఆయిల్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. రెండు డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్‌తో కలిపి అప్లై చేసుకోండి. దీనితో నల్లమచ్చల వంటి సమస్యలు పూర్తిగా తొలగి పోతాయి.