Apple For Beauty : అందానికి యాపిల్ తో ఫేస్ ప్యాక్స్! |Face packs with Apple for beauty!

Apple For Beauty : అందానికి యాపిల్ తో ఫేస్ ప్యాక్స్!

చర్మంలో మెరుపుదనం కోసం ఒక చిన్న యాపిల్ పండు తీసుకుని మొదట ఉడకబెట్టాలి. తరువాత యాపిల్ పై ఉండే తొక్కను తీసేయాలి. యాపిల్ ను ఒక బౌల్ లో తీసుకుని మెత్తగా గుజ్జులా మార్చుకోవాలి.

Apple For Beauty : అందానికి యాపిల్ తో ఫేస్ ప్యాక్స్!

Apple For Beauty : ఆరోగ్యానికి యాపిల్ ఎంతో మేలు చేస్తుంది. రోజుకో యాపిల్ పండు తింటే డాక్టరుతో కూడా పనిలేదని అంటుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే యాపిల్ ముఖాన్ని అందంగా మార్చటంలో కూడా తోడ్పడుతుంది. యాపిల్ లో ఉండే ఎ,సి విటమిన్లు, కాపర్ లతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. యాపిల్ తో ఇంట్లోనే సులభంగా ఫేస్ ఫ్యాక్స్ తయారు చేసుకోవచ్చు. యాపిల్ ఫేస్ ఫ్యాక్స్ ను ఉపయోగిస్తే చర్మం నిగారింపు సంతరించుకోవటంతోపాటు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే యాపిల్ తో ఫేస్ ఫ్యాక్స్ ఎలా చేయవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

యాపిల్ ఫేస్ ప్యాక్స్ విషయానికి వస్తే ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని సన్నగా ముక్కలుగా తురుముకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాాలి. అందులోకి కొంచెం పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ ఫ్యాక్ బాగా ఉపకరిస్తుంది.

చర్మంలో మెరుపుదనం కోసం ఒక చిన్న యాపిల్ పండు తీసుకుని మొదట ఉడకబెట్టాలి. తరువాత యాపిల్ పై ఉండే తొక్కను తీసేయాలి. యాపిల్ ను ఒక బౌల్ లో తీసుకుని మెత్తగా గుజ్జులా మార్చుకోవాలి. దీనికి బాగా పండిన ఒక చిన్న అరటిపండును గుజ్జుగా చేసి కలపాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ మీగడను బౌల్ లో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలపాటు ఆరనిచ్చి తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ముఖంలో గ్లో కోసం సన్నగా తురిమిన రెండు స్పూన్ల యాపిల్ ముక్కల్ని తీసుకుని, అందులోకి ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. కొంత సేపటి తరువాత ముఖాన్ని కడుక్కకుంటే ముఖ చర్మం గ్లోగా మారుతుంది. అలాగే ఒక బౌల్ లో యాపిల్ తురుమును తీసుకుని అందులో తగినంత తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మ ఆరోగ్యం పెంపొందటంతోపాటు, అందంగా కనిపించవచ్చు.

×