Bananas For Beauty : వేసవిలో అందానికి అరంటిపండుతో ఫేస్ ప్యాక్స్!

కప్పులో సంగం అరటి పండు పేస్ట్ ను తీసుకుని అందులోకి టేబుల్ స్పూన్ తేనెను కలిపి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. తరచుగా ఇలా చేస్తే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

Bananas For Beauty : వేసవిలో అందానికి అరంటిపండుతో ఫేస్ ప్యాక్స్!

Banana Face Packs (1)

Bananas For Beauty : అరటి పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. తక్షణ శక్తినిచ్చే పండుగా దీనికి పేరుంది. ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందాన్ని మెరుగు పరుస్తుంది. అరటి పండుతో ఫేస్ ప్యాక్స్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో కాలుష్యం, ఎండ వంటివి చర్మం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. చర్మం గరుకుగా మారడం, నిర్జీవంగా కనిపించటం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటి నుండి బయటపడాలంటే అరటి పండుతో ఫేస్ ప్యాక్స్ ను తయారు చేసుకుని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

అరటి పండుతో ఫేస్ ఫ్యాక్స్ ;

1. ఒక బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా మార్చుకోవాలి. దానిని ముఖం, మెడ ప్రాంతంలో అప్లై చేయాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

2. అరటి పండు సగం, ఆవకాడో పండు సంగం రెండు కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంటపాటు వదిలేయాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుపుదనంతో ఉంటుంది.

3. కప్పులో సంగం అరటి పండు పేస్ట్ ను తీసుకుని అందులోకి టేబుల్ స్పూన్ తేనెను కలిపి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. తరచుగా ఇలా చేస్తే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

4. ఒక అరటి పండును తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంటపాటు ఉంచుకోవాలి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృధువుగా మారుతుంది.

5. చర్మంపై మృతకణాల్ని తొలగించుకునేందుకు అరటిపండు, టేబుల్ స్పూన్ తేనె, కోడిగుడ్డులోని పచ్చసొన కలిపి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి.

6. చర్మంతోపాటు జుట్టుకు సైతం అరటి మేలు చేస్తుంది. వారంలో ఒక రోజు బాగా మగ్గిన అరటిపండు గుజ్జులో ఒక టీ స్పూను పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని మాడు నుండి జుట్టు చివర్ల వరకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటంతోపాటు తగిన పోషణ అందుతుంది.