Facial Paralysis : ముఖ పక్షవాతం…లక్షణాలు…కారణాలు

ముఖ పక్ష పక్షవాతం వచ్చిన వారిలో ముఖంలో బిగదీసుకుపోయినట్లు కనిపిస్తుంది. ముఖ కండరాలను కదిలించటం కష్టతరంగా మారుతుంది. వ్యాధి ప్రభావిత భాగంలో నాలుకకు రుచిన గ్రహించే శక్తి క్షీణిస్తుంది.

Facial Paralysis : ముఖ పక్షవాతం…లక్షణాలు…కారణాలు

Muka Pakshavatham

Facial Paralysis : అనుకోని సందర్భాల్లో ముఖం పక్షవాతానికి గురవుతుంది. మన ముఖంలో కండరాల కదలికలను నియంత్రించేందుకు కొన్ని నరాలు పనిచేస్తుంటాయి. ఇవి మెదడు నుండి అంతర్గత చెవి నుండి ప్రయాణించి ముఖాన్ని చేరతాయి. ముఖ కండరాలను నియంత్రించే వాటిల్లో ఫేషియల్ నరం ప్రధానమైనది. ఇన్ ఫ్లమేషన్ కారణంగా ఇది వాచిపోతుంది. దీని వల్ల దాని అధీనంలో ఉండే ముఖ కండరాలు బలహీనంగా మారతాయి. దాని ప్రభావంతో ముఖం ఒక వైపు లాగేస్తుంటుంది. దీనినే ముఖ పక్ష వాతంగా పిలుస్తారు.

ముఖ పక్ష వాతం రావటానికి చలివాతావరణం ముఖ్యమైన కారణం. దీనితోపాటు చలితో కూడిన ఈదురుగాలల్లో తిరిగే వారికి కొన్ని సందర్భాల్లో ముఖ పక్షవాతానికి గురవుతుంటారు. అంతే కాకుండా వైరస్ వ్యాధులు, తీసుకునే ఆహారంలో లోపాల వల్ల ఈ ముఖ పక్ష వాతం వచ్చే అవకాశాలు ఉంటాయి.

ముఖ పక్ష పక్షవాతం వచ్చిన వారిలో ముఖంలో బిగదీసుకుపోయినట్లు కనిపిస్తుంది. ముఖ కండరాలను కదిలించటం కష్టతరంగా మారుతుంది. వ్యాధి ప్రభావిత భాగంలో నాలుకకు రుచిన గ్రహించే శక్తి క్షీణిస్తుంది. కన్నీరు కారతుండటాన్ని గమనించవచ్చు. ఆహారం తినాలన్నా, నీళ్ళు తాగాలన్నా సాధ్యపడదు.

ముఖ పక్ష వాతం వచ్చిన వారు ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, మద్యం, చల్లని పదార్ధాలు తీసుకోవటం మానేయాలి. చలికి, వర్షానికి తిరగకుండా ఉండాలి. కళ్ళకు కళ్ళద్దాలను పెట్టుకుని తిరగాలి. చెవుల్లోకి గాలి వెళ్ళకుండా దూది పెట్టుకోవటం మంచిది. ముఖ పక్ష వాతాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించి సకాలంలో చికిత్స పొందటం వల్ల త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.