Flushing Public Toilet : పబ్లిక్ టాయిలెట్ ఇలా ఫ్లష్ చేస్తున్నారా? కరోనా సోకుతుంది జాగ్రత్త!

పబ్లిక్ టాయిలెట్ ఇలా ఫ్లష్ చేస్తున్నారా? అసలే చేయొద్దు.. ఎందుకంటే ఏరోసోలైజ్డ్ బిందువుల ద్వారా గాల్లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. టాయిలెట్ ఫ్లష్ చేసేటప్పుడు మూత పెట్టి ఫ్లష్ చేయాలని కొత్త అధ్యయనం చెబుతోంది.

Flushing Public Toilet : పబ్లిక్ టాయిలెట్ ఇలా ఫ్లష్ చేస్తున్నారా? కరోనా సోకుతుంది జాగ్రత్త!

Flushing A Public Toilet Don't Linger, Because Aerosolized Droplets Do (1)

Flushing Public Toilet : పబ్లిక్ టాయిలెట్ ఇలా ఫ్లష్ చేస్తున్నారా? అసలే చేయొద్దు.. ఎందుకంటే ఏరోసోలైజ్డ్ బిందువుల ద్వారా గాల్లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. టాయిలెట్ ఫ్లష్ చేసేటప్పుడు మూత పెట్టి ఫ్లష్ చేయాలని కొత్త అధ్యయనం చెబుతోంది. టాయిలెట్ ఫ్లష్ చేయడం వల్ల టాయిలెట్ డిజైన్, నీటి పీడనం లేదా ఫ్లషింగ్ శక్తిని బట్టి పెద్ద మొత్తంలో వైరస్ ఏరోసోల్స్ ఉత్పత్తి అవుతాయి. వ్యాధికారక సూక్ష్మజీవులు సాధారణంగా నీటితో పాటు మూత్రం, మలం, వాంతిలో కనిపిస్తాయి. ఏరోసోలైజేషన్ ద్వారా విస్తృతంగా గాల్లోకి చేరుతాయి. ఈ వ్యాధికారకాలు ఎబోలా, నోరోవైరస్, SARS-CoV-2 వల్ల కలిగే COVID-19 వ్యాప్తికికారణమవుతాయని అధ్యయనం హెచ్చరిస్తోంది.

Flush

ఫ్లషింగ్ ద్వారా జరిగే ప్రక్రియ సాధారణ దృష్టితో చూస్తే కనిపించదు. గాల్లో ఉండే బిందువులు పరిసరాల్లో అతుక్కుపోయి తర్వాత కూర్చొనే వ్యక్తికి అంటుకుంటాయి. లేదా వైరస్ గాల్లో ఉండిపోతే తర్వాత వచ్చే వ్యక్తి శ్వాస నాళాల్లో ఇరుక్కుంటుంది. COVID-19 శ్వాస బిందువులు వైరస్ వ్యాప్తికి ప్రధాన మార్గం.. మూత్రం, మలం నమూనాలలో వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. COVID-19 వ్యాప్తికి పబ్లిక్ రెస్ట్ రూంలు ఎక్కువగా కారణమవుతున్నాయి. తగినంత వెంటిలేషన్ లేకపోవడం కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని అధ్యయనంలో తేలింది.

సాధారణ వెంటిలేషన్ పరిస్థితులలో పబ్లిక్ రెస్ట్ రూం, టాయిలెట్ ఫ్లష్ చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే నీటి బిందువులను ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ సైంటిస్టుల బృందం పరీక్షించింది. ఫ్లషింగ్ తర్వాత ఉత్పన్నమయ్యే బిందువుల పరిమాణం, సంఖ్యను కొలిచారు. పబ్లిక్ విశ్రాంతి గదులు అనేక రకాల వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని తేలింది. దీనికి సంబంధించి అధ్యయనాన్ని ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురించారు. 100 కంటే ఎక్కువ ఫ్లష్లతో మూడు గంటల పాటు పరీక్షించారు. ఏరోసోల్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలను కనుగొన్నారు.

Toilet

ప్రతి ఫ్లషింగ్ టెస్టులో పదివేల వరకు బిందువుల సంఖ్యను గుర్తించారు. టాయిలెట్, మూత్రం రెండూ 3 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో పెద్ద మొత్తంలో బిందువులను ఉత్పత్తి చేస్తాయని తేల్చేశారు. సూక్ష్మజీవులతో గణనీయమైన వ్యాప్తికి కారణమవుతాయని గుర్తించారు. ఫ్లష్ ప్రారంభించిన తర్వాత 20 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువసేపు 5 అడుగుల ఎత్తులో బిందువులను గుర్తించారు. టాయిలెట్ మూసివేసిన మూత నుంచి గాలిలో తక్కువ సంఖ్యలో బిందువులు ఉత్పత్తి అయినట్టు పరిశోధకులు గుర్తించారు.