Sodium : శరీరంలో సోడియాన్ని సమతుల్యం చేసే ఆహారాలు

పొటాషియం అధికమోతాదులో లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఉప్పు నిండిన ఆహారం తిన్నాక మీ రక్తపోటు స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.

Sodium : శరీరంలో సోడియాన్ని సమతుల్యం చేసే ఆహారాలు

Sodium

Sodium : మనం రోజు తీసుకునే ఆహారంలో రుచి కోసం ఉప్పును వాడుతుంటాం. అయితే మనం తీసుకునే ఉప్పు తక్కువ మోతాదులో ఉండాలి. అలా కాకుండా అధిక మోతాదులో ఉప్పు తీసుకుంటే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉప్పుని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల రక్తపోటు వస్తుంది. అలాగని ఉప్పును పూర్తిగా మానేయటం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

మన శరీర పనీతీరులో సోడియం అనేది ఒక ముఖ్యమైన ఖనిజం. ఉప్పులో ఉండే సోడియం రక్త ప్రసరణ, కండరాల సంకోచం, ఖనిజాల సమతుల్యత, నరాల ప్రేరణకు ఉపకరిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచన ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5గ్రాముల ఉప్పు తీసుకోవాలని సూచిస్తుంది. అధిక మోతాదులో ఉప్పు తీసుకుంటే డీహైడ్రేషన్ తోపాటు, పొట్ట ఉబ్బరం, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఆహారం తిన్నసమయంలో శరీరంపై ఉప్పు ప్రభావం తగ్గించేందుకు కొన్ని రకాల ఆహారాలు చక్కని పరిష్కారంగా దోహదపడతాయి.

ఉప్పు అధికంగా తీసుకుంటే వెంటనే అల్లం టీ తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. కడుపుబ్బరాన్ని పోగొట్టి ఉప్పు కారణంగా నెలకొనే ఇబ్బందులను తొలగించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. శరీరంలో అధిక మోతాదులో ఉన్న ఉప్పును తగ్గించటంలో అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం అధిక సోడియాన్ని ఎదుర్కోంటుంది. ఉప్పు అధికంగా ఉంది అనుకున్న ఆహారంలో పెరుగును కలుపుకుని తినటం ఉత్తమం. పెరుగు జీర్ణాశయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొటాషియం అధికమోతాదులో లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఉప్పు నిండిన ఆహారం తిన్నతరువాత రక్తపోటు స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆసమయంలో అరటి పండు తింటే ఆ స్థాయిలు అదుపులో ఉంచవచ్చు.  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహయపడుతుంది. అలాగే తియ్యగా, పుల్లగా ఉండే కివీ పండులో  పొటాషియం ఉంటుంది. ఇది సోడియాన్ని తటస్థీకరించడంలో ఉపకరిస్తుంది. తద్వారా ఎక్కవ మోతాదులో ఉన్న సోడియంను తగ్గించుకోవచ్చు.

ఫాస్ట్ ఫుడ్ మరియు చిప్స్ వంటి ఉప్పు అధికంగా వినియోగించే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం పరిమితం చేయాలి. వాటికి బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అదనపు సోడియం లేకుండా తయారుచేసిన మాంసాలు వంటి తాజా ఆహారాన్ని తినండి. శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉంటే కొన్ని లక్షణాల ద్వారా ఆ విషయాన్ని కనిపెట్టవచ్చు. కడుపు ఉబ్బరంగా అనిపించడం, విపరీతంగా దాహం, తరచూ మూత్రానికి వెళ్లడం, బరువు పెరగడం, వాంతులు, గుండె రేటులో తేడా… ఈ లక్షణాలలో కనీసం రెండు కనిపించినా కూడా ఓసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి.