Immunity Boost : గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలల్లో ఉండే లాక్టోఫెర్రిన్ వైరల్ ,శరీర కణాల మధ్య పరస్పర చర్యకు అంతరాయం కలిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Immunity Boost : గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

Pregnant Women

Immunity Boost : గర్భదారణ సమయంలో స్త్రీలు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. తల్లి, శిశువుల ఆరోగ్యం కోసం పోషకాహారం ఎంతగానో మేలు చేస్తుంది. బరువు పెరగటానికి, శక్తి కి సమతుల్య ఆహారం గర్భదారణ సమయంలో అవసరం. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. సరైన పోషకాహారం తీసుకోవటం వల్ల గర్భిణీ స్త్రీలలో రక్తహీనత, గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

గర్భదారణ సమయంలో సరైన ఆహారం తీసుకోనట్లైతే అది పుట్టబోయే శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను తీసుకోవాలి. రోగనిరోధక శక్తి లేకపోతే సులభంగా అనారోగ్యాల భారిన పడే అవకాశాలు ఉంటాయి. జలుబు, ఫ్లూ , వైనల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల సమస్యలను ఎదుర్కోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.

వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ;

అల్లం : అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. తలతిరగటం, వికారం నుండి ఉపశమనం అందించడంలో అల్లం సహాయపడుతుంది. ఆహారంలో అల్లం చేర్చడం ద్వారా జీర్ణక్రియ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అల్లం సులభంగా జీర్ణక్రియను పెంచడానికి దోహదపడుతుంది.

పసుపు : పసుపు యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ లక్షణాలతో నిండి ఉంటుంది. పసుపు పాలు తాగడం వల్ల గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు పాలు గర్భధారణ సమయంలో జలుబు ,దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి.

వెల్లుల్లి : చాలా మంది గర్భిణీ స్త్రీలు 9 నెలల పాటు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది గ్యాస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

పాలు : పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలల్లో ఉండే లాక్టోఫెర్రిన్ వైరల్ ,శరీర కణాల మధ్య పరస్పర చర్యకు అంతరాయం కలిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

నీరు ; గర్భదారణ సమయంలో నీరు పుష్కలంగా తీసుకోవాలి. పండ్ల రసాలు, పాలు, మిల్క్ షేక్ లను తీసుకోవాటం తోపాటు క్రమం తప్పకుండా నీటిని సేవిస్తుండాలి.

వీటితోపాటు ఆకుపచ్చ కూరగాయలు, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఎ, బి 6, బి 12, సి మరియు డి, అలాగే ఇతర ఖనిజాలు గర్భదారణలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్వల్పకాలిక నడక మేలు చేస్తుంది. వైద్యుని సూచనలు సలహాలు నిరంతరం పొందటం మంచిది. జంక్ ఫుడ్ తీసుకోకపోవటమే మంచిది.