Nature Prescription : ఆరోగ్యవంతమైన జీవనం కోసం…. ప్రకృతి రాసిచ్చిన ప్రిస్ర్కిప్షన్

నూనె పదార్ధాలు శరీరానికి కొంతమేర అవసరం. ఆహారంలో ఉండే విటమిన్లు, కెరటినాయిడ్స్ ని శరీరం గ్రహించటానికి నూనె పదార్ధాలు తోడ్పడతాయి.

10TV Telugu News

Nature Prescription : ప్రకృతిలో మనిషి హాయిగా జీవించాలని కోరుకుంటాడు. ప్రకృతి సిద్ధంగా లభించిన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం ఉన్నా అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కోరి సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టిన సందర్భంలో ఆసుపత్రులు, మందులు చుట్టూ తిరగటం తప్ప, ప్రకృతి చూపిన బాటలో నడవలేకపోవటం వల్లే తనకు ఈ దుస్ధితి పట్టిందన్న విషయాన్ని ఏమాత్రం గ్రహించడు. మనిషి ఆరోగ్యంగా జీవనం సాగించేందుక ప్రకృతి ముందుగానే పది ప్రిస్ర్కిప్షన్స్ రాసి మన ముందుంచింది…అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఆకలికి అనుగుణంగా ఆహారం ; ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తినే ఆహారం తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రుచిగా ఉందికదా అని ఎక్కువ మొత్తంలో తీసుకోవటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది ఆకలి తగ్గుతుంది. ఎక్కవ ఆహారాన్ని తీసుకోలేరు. జీర్ణక్రియల వేగం పెంచుకునేందుకు తగినంత వ్యాయామం చేయాలి. రోజుకు గంటపాటు నడవటం మంచిది.

ఇంద్రధనస్సు ఆహారం ; ఇంద్ర ధనస్సు రంగుల్లో ఆహారాలను తీసుకుంటే అనేక జబ్బులను దరి చేరకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా గుండెజబ్బులు, క్యాన్సర్ల వంటి వ్యాధులను అదుపులో ఉంచవచ్చు. ఇందుకోసం బొప్పాయి, టమాట, బీట్ రూట్, మిర్చి, క్యారెట్ ఇలాంటి ఆహారాలను తీసుకునే తిండిలో భాగం చేసుకోవాలి.

ఆహారంలో మార్పులు ; మనం తీసుకునే ఆహారాలను మార్చి మార్చి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ఒకే రకమైన భోజనం తీసుకోవటం మంచిది కాదని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి వివిధ రకాలైన ప్రకృతిసిద్ధంగా లభించే ఆహారపదార్ధాలను తీసుకోవాలి.

ఆహారం ఎంతమోతాదులో తీసుకోవాలి ; చిన్న వయస్సులో కొద్ది మొత్తంలో ఆహారం తీసుకుంటారు. అదే యుక్తవయస్సులో కాస్త ఎక్కవ మొత్తంలో తింటారు. వయస్సు పై బడుతున్న కొద్ది తినే ఆహారంలో మోతాదును తగ్గించాలి. మంచి పోషకాలుండే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకునే చూసుకోవాలి.

ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాన్ని ఎంచుకోవాలి ; మనం తీసుకునే ఆహారం రుచికరంగా ఉండాలని చాలా మంది కోరుకుంటుంటారు. మంచిదే అయితే వాటి వల్ల ఆరోగ్యానికి హాని కలగుతుందా అన్న విషయాన్ని ఆలోచించాలి. తీపి రుచి చూడాలని పిస్తే పంచదారకు బదులు బెల్లాన్ని కాని, తేనెను కాలిన తీసుకోవాలి. తేనె యాంటాక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇలా చేయటం వల్ల గుండెజబ్బులతో పాటు ఇతర ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.

దుంప ఆహారాలతో తంటా ; వారానికి రెండు సార్లు పొటాటో చిప్ప్ తినే మహిళలకు మధ్య వయసులో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. తోలుతో సహా ఉడికించి వెల్లుల్లి , అల్లం, ఆలివ్ నూనెలతో సహా వాడే బంగాళా దుంపలతో ఎలాంటి సమస్య ఉండదు. కాని బంగాళా దుంపల ముక్కలతో చేసే ఫ్రెంచి ఫ్రైలు , ఆలు చిప్స్ వంటివి ఆనారోగ్యాన్ని కలిగిస్తాయి. వీటిని కొవ్వు పదార్ధాలు అధికంగా ఉండటం వల్ల ప్రమాదాన్ని కలిగిస్తాయి.

సనాతన ఆహారాలను తీసుకోవటం మంచిది ; చిరుతిండ్లు, హోటల్ తిండ్ల వల్ల ఆరోగ్యసమస్యలు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్రకృతిలో లభించే గుగ్గిళ్లు, ఓట్స్, రాగులు, సజ్జలు వంటి వాటిని తీసుకుంటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. పోషకాల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

కొవ్వుని చూసి భయపడొద్దు ; నూనె పదార్ధాలు శరీరానికి కొంతమేర అవసరం. ఆహారంలో ఉండే విటమిన్లు, కెరటినాయిడ్స్ ని శరీరం గ్రహించటానికి నూనె పదార్ధాలు తోడ్పడతాయి. మోనో అన్ స్యాచురేటెడ్ కొవ్వులు రక్తనాళాల గోడలను ధృడం చేస్తాయి. మంచి కొలెస్టరాల్ ని పెంచి చెడు కొలెస్టరాల్ ని తగ్గిస్తాయి. డాల్డా వంటి ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు తప్పవన్న విషయం గుర్తుంచుకోవాలి.

వయస్సు పెరిగే కొద్దీ ; వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఫోలేట్ లోపం ఏర్పడుతుంది. దీని వల్ల మతిమరుపు వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే పెద్ద వయస్సు లో ఫోలేట్ కలిగిన ఆహారాలను తీసుకోవాలి. ఆకు కూరలు, కమలా, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ కలిగిన పండ్లను అధిక మొత్తాల్లో తీసుకోవాలి. దీని వల్ల అల్జిమర్స్ వంటి వ్యాధులు దరి చేరకుండా చూసుకోవచ్చు.

ఇంటి పంటనే వంటకు వాడటం ఆరోగ్యకరం; మనం రోజు తీసుకునే ఆహారాన్ని మన పెరట్లోనో, ఇంటి ఆవరణలోనే సహజమైన పద్దతుల్లో పండించుకోవటం మంచిది. ముఖ్యంగా ఆకు కూరలు, కూరగాయలు వంటి వాటిని రసాయనిక పురుగు మందుల వినియోగం లేకుండా సేంధ్రియ విధానంలో పండించుకుని తినాలి. ఇలా చేయటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తప్పుతుంది.

×