Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!

ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, క్యారెట్స్‌ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్‌, ఖనిజాలు లభ్యమవుతాయి. ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. కిచిడి, పొంగలి, పెసరపాయసం వంటివి పలుచగా చేసి తినిపించవచ్చు.

Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!

Baby Health Growth

Baby Health : పిల్లలు 6 నెలలవరకు తల్లిపాల మీద ఆధారపడి ఉంటారు. అయితే 6 నెలల తర్వాత నుండి తల్లిపాలు వీరికి సరిపోవు. తర్వాత వీరి పెరుగుదలకు అవసరమైన కాలరీలు, ప్రోటీన్ల అవసరత పెరుగుతుంది. తల్లిపాలతో పాటు, పోతపాలు ఇతర ఆహారపదార్దాలను ద్రవరూపం లోగాని, ఘనరూపంలోగాని అలవాటు చేయాలి. 6 నెలల నుండి పండ్లరసాలను అందివ్వాలి. తల్లిపాలు ఇస్తూ ఆవుపాలుకాని, గేదెపాలుకాని అలవాటు చేయాలి. ఈ పోతపాలలో పోషకాలు తల్లిపాలతో పోలిస్తే వేరుగా ఉండటం చేత, పిల్లలు అలవాటు పడటానికి పాలలో, కాచి చలార్చిన నీళ్ళను, పంచదారతో కలిపి తాగించాలి.

ఆరంజ్‌, టమాటో, ద్రాక్ష వంటి పండ్లు మంచి పోషకాలు కలిగిఉంటాయి. వీటిలో లభ్యమయ్యే పోషకాలు పాలలో దొరకవు. అందుచేత ఈ పండ్ల రసాలను పిల్లలకు కాచి చల్లార్చిననీళ్ళు కలిపి ఇవ్వాలి. క్రమంగా జ్యూస్‌ మోతాదు ను పెంచుతూ, నీటిశాతం తగ్గించాలి. వీటితోపాటు ఫిష్‌లివర్‌, ఆయిల్‌ కొన్ని చుక్కలు నుండి అరటేబుల్‌ స్పూన్‌ కొన్ని పాలలోకలిపి ఇవ్వడం వలన విటమిన్‌ ఎ, విటమిన్‌ డి లభ్యమవుతుంది. పెరుగు తున్న కాలరీస్‌, ప్రొటీన్ల ఆవశ్యకతల వల్ల వాటిని సరైన రీతిలో అందించడా నికి, బాగా ఉడికించి, మెత్తగా చేసిన తృణధాన్యాలను పాలు, చక్కెర కలిపి పెట్టాలి. క్యాలరీస్‌ ఎక్కువగా లభ్యమయ్యే మాల్టెడ్‌వీట్‌, రాగిని ఈ ఆహారంలో చేర్చాలి.

ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, క్యారెట్స్‌ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్‌, ఖనిజాలు లభ్యమవుతాయి. ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. కిచిడి, పొంగలి, పెసరపాయసం వంటివి పలుచగా చేసి తినిపించవచ్చు. 10-12 నెలల సమయంలో బాగా ఉడికించిన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, మాంసం పండ్లు పెట్టాలి. ఇడ్లీ, ఉప్మా, బ్రెడ్‌, చపాతి, అన్నం, పప్పు వంటివి అలవాటు చేయాలి. ఉడికించిన గుడ్డు పచ్చసొన కొంచెం తినిపించాలి. దానివల్ల ఎలర్జీ ఉండదు. పిల్లలు తినగలుగుతున్నారని నిర్ధారిం చుకున్న తర్వాత క్రమంగా మోతాదు పెంచుతూ మొత్తం పచ్చసొన తినిపించ వచ్చు.

గొంతులో ఇరుక్కునే అవకాశం ఉన్న పప్పుదినుసులు, ఎండుద్రాక్ష, పచ్చియాపిల్‌, కూరగాయలు, పాప్‌కార్న్‌ వంటివి దూరంగా ఉంచాలి. ఎందుకంటే గొంతులో ఇరుక్కుని వీటివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బంది కలుగుతుంది.