Smoothy Feet : అందమైన పాదాల కోసం…

పాదాలను గోరువెచ్చటి నీళ్లలో పదినిమిషాలు పెట్టాలి. తరువాత రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి, ఒక టీస్పూన్‌ తేనె, నాలుగైదు చుక్కల వెనిగర్‌ను పేస్టులా చేసి పగుళ్లు ఉన్న చోట స్క్రబ్‌ చేయాలి.

Smoothy Feet : అందమైన పాదాల కోసం…

Feets

Smoothy Feet : ముఖానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా మంది తమ కాళ్ళ పాదలకు ఇవ్వరు. పాదాలు మృదుత్వాన్ని కోల్పోయినా పట్టించుకోరు. పాదాలు పగిలిపోయినప్పటికీ వాటి గురించి  పట్టించుకోకుండా వాటి సంరక్షణ బాద్యత తమది కాదన్నట్లు వ్యవహరిస్తుంటారు. ముఖానికి ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామో పాదాల విషయంలో అలాంటి సంరక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది. కాళ్ళ పాదాలు ఆరోగ్య కరంగా ఉండాలంటో ఇలా చేసి చూడొచ్చు.

శెనగపిండిని పసుపుతో కలిపి, పెరుగు, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని పాదాలకు మాస్క్ లా అప్లై చేయాలి ఇరవై నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అందమైన ఆరోగ్యమైన పాదాలు మీ సొంతం అవుతాయి.అరటిపండు న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. రెండు అరటిపండ్లను మెత్తగా చేసి పాదాలకు రాయాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రెండు వారాల పాటు ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి.

నిత్యం పాదాలను శుభ్రం చేసుకోవడం వల్ల పాదాలపై ఉండే రఫ్‌ చర్మం పోయి సున్నితంగా తయారవుతుంది. వాటికి మాయిశ్చరైజర్‌ పట్టించడం మరవొద్దు. పాదాలకు మాయిశ్చరైజర్‌ క్రీమును పట్టించి, కాటన్‌ సాక్స్‌ వేసుకొని, వాటితోనే రాత్రి పడుకోవాలి. కొద్దిగా లిక్విడ్‌ సోప్‌ లేదా జెల్‌తో పాదాలను శుభ్రంగా కడుక్కుంటే అందంగా కనిపిస్తాయి. ఒక టబ్‌లో కొన్ని గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో ఒక కప్పు తేనె వేయాలి. అందులో పాదాలు పెట్టి ఇరవై నిమిషాల పాటు నెమ్మదిగా పాదాలపై మర్దన చేయాలి. తరువాత పాదాలను పొడిగుడ్డతో తుడిచి మాయిశ్చర్‌ రాసుకోవాలి.

పాదాల అంచులు చాలామందికి పగలడం చూస్తాం. పగుళ్ల వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఈ పగుళ్లను పోగొట్టుకోవాలంటే క్యాండిల్‌ వాక్స్‌ కరగబెట్టి అంతే మొత్తంలో ఆవ నూని అందులో కలిపి పేస్టులా చేసి పాదాల అంచులకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి. గోరువెచ్చని నీటిలో పావుగంటపాటు పాదాలను పెట్టి తరువాత పొడిగుడ్డతో తడుచుకోవాలి. తరువాత ఒక టీస్పూన్‌ వ్యాజిలైన్‌లో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి పాదాలకు రాసుకుని సాక్స్‌ ధరించి పడుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు దూరమవుతాయి.

పాదాలను గోరువెచ్చటి నీళ్లలో పదినిమిషాలు పెట్టాలి. తరువాత రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి, ఒక టీస్పూన్‌ తేనె, నాలుగైదు చుక్కల వెనిగర్‌ను పేస్టులా చేసి పగుళ్లు ఉన్న చోట స్క్రబ్‌ చేయాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. గోరువెచ్చటి నీటిలో పాదాలు ఉంచడం వల్ల మృతకణాలు పోతాయి. ఇది అందరికీ తెలుసు కానీ చేయరు. అయితే వారానికి రెండుసార్లు కనుక పాదాలు ఇలా శుభ్రం చేసుకుంటే మృదువుగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.

మడమలను స్క్రబ్బర్‌తో రుద్దుకునేటప్పుడు కాలి వేళ్ల మధ్య కూడా శుభ్రం చేసుకోవడం మరవొద్దు.కాలివేళ్లకు ఉన్న గోళ్లను తీసేసి శుభ్రం చేసుకోవాలి. గోళ్లను పెంచుకుంటే వాటికి నెయిల్‌ పాలిష్‌ వేసుకోవాలి. పాదాలపై పొడి చర్మం ఉండకుండా చూసుకోవడంతో పాటు తప్పనిసరిగా వాటికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. స్నానం అయిన వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

గోరువెచ్చని నూనెతో పాదాలకు మాయిశ్చరైజ్ చేయాలి. హాట్ ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజ్ గా మాత్రమే కాదు, డెడ్ స్కిన్ తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది.పాదాలను దుమ్ము, ధూళి, సూర్యరశ్మి నుండి పాదాలను కాపాడుకోవడానికి షూ వేసుకోవాలి.