Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!

విటమిన్‌  డి కి మూలం సూర్యరశ్మి, ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్‌ డి లభిస్తాయి. తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు.

Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!

Healthy Bones

Bone Health : వయస్సు పెరిగే కొద్దీ అనేక రకాల శరీర నిర్మాణ సంబంధమైన , శారీరక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తాయి. కండరాలు, ఎముక ద్రవ్యరాశిని కోల్పోవటం జరుగుతుంది. వయస్సుతో పాటు మానవ శరీరంలో ఎముకలు క్షీణించడం సాధారణం. వయసు పెరుగుతున్నకొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గినట్టే, ఎముకలూ పెళుసుబారతాయి. శరీరంలో ఎముకల క్షీణత విపరీతంగా ఉంటే ఏ వ్యక్తి అయినా బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో నడక సామర్థ్యం కోల్పోయే అవకాశం ఉంది.

ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్‌ డి చాలా అవసరం. సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. పప్పు ధాన్యాలు ,పాలు, పాల ఉత్పత్తుల నుంచీ మాంసకృత్తులు లభిస్తాయి.

విటమిన్‌  డి కి మూలం సూర్యరశ్మి, ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్‌ డి లభిస్తాయి. తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్‌ డ్రింక్స్‌, మాంసాహారం, కాఫీ తీసుకోవడం, ధూమపానం చేయడం, శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఎముకలు పెళుసుబారిపోతుంటాయి. అలాగే విటమిన్ సి కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. విటమిన్ సి యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు ఎముక కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. ఆకుపచ్చ, పసుపు పచ్చ కూరగాయలను అధికంగా తీసుకోవడం ద్వారా ఎముక ఖనిజ సాంద్రత పెరుగుతుంది.

సరైన పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే వయసుతోపాటు వచ్చే కీళ్లు, మోకాళ్ల అరుగుదల సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చు.