Jaundice : పచ్చకామెర్లకు...గృహవైద్యం |For jaundice ... Homeopathy

Jaundice : పచ్చకామెర్లకు…గృహవైద్యం

హెపటైటిస్‌ బి, సి, డి లు రక్తమార్పిడి ద్వారా, ఒకరికి వాడిన ఇంజక్షన్‌ సూదులు ఇతరులకు వాడటం ద్వారా , సెక్స్‌ ద్వారానూ సంక్రమించే అవకాశముంది..

Jaundice : పచ్చకామెర్లకు…గృహవైద్యం

Jaundice : పచ్చకామెర్లను జాండిస్‌ అని వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్రకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురూబిన్‌ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురూబిన్‌ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. అయితే ఈ జాండిస్ వస్తే చాలా మంది భయపడడం జరుగుతూ ఉంటుంది. కామెర్లకు ముఖ్య కారణాలకు సంబంధించి
ఒకటి రక్తంలోని ఎర్రకణాలు అత్యధికంగా విచ్ఛిత్తి గావడం. దీన్ని హీమోలిటిక్‌ జాండిస్‌ అంటారు. రెండవది ఎర్రకణాల విచ్ఛిత్తి మూలకంగా చోటుచేసుకున్న బిలురూబిన్‌ లివర్‌ కణాలలోకి చేరలేకపోవటం. దీన్ని హెపాటిక్‌ జాండిస్‌ అని వ్యవహరిస్తారు. మూడోది లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం ప్రవాహ మార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవటం. దీన్ని అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌ అంటారు.

లివర్ ఇన్ఫెక్షన్‌, ఆల్కహాల్‌, పౌష్టికాహార లోపము పచ్చకామెర్లకు దారితీస్తుంది. జాండిస్ ఇన్ ఫెక్షన్లను 5రకాలుగా వర్గీకరించారు. హెపటైటిస్‌- ఎ, బి, సి, డి, ఇ లుగా పిలుస్తారు. హెపటైటిస్‌ ఎ, ఇ లు కలుషిత నీరు, ఆహారపదార్ధాల ద్వారా సంక్రమిస్తాయి. హెపటైటిస్‌ బి, సి, డి లు రక్తమార్పిడి ద్వారా, ఒకరికి వాడిన ఇంజక్షన్‌ సూదులు ఇతరులకు వాడటం ద్వారా , సెక్స్‌ ద్వారానూ సంక్రమించే అవకాశముంది.. కామెర్ల రోగులలో కళ్లు, చర్మం పచ్చగా కనిపిస్తాయి. చర్మం దురదపెడుతుంది. మలం తెల్లగా, మూత్రం పసుపు రంగులో ఉంటాయి. రక్తస్రావం కనిపించొచ్చు. శీతాకాలంలో అధికంగా నీటిప్రభావానికిలోనై వచ్చే వ్యాధులలో పచ్చ కామెర్లవ్యాధి ఒకటి. తగిన జాగ్రత్తలు తీసుకుని సత్వరనివారణ చర్యలు చేపట్టకుంటే ఇది మన శరీరంలో అత్యంత ప్రధానభాగమైన కాలేయాన్ని పనిచేయకుండా చేస్తుంది.

కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా వీటి నుంచి మనకి కాస్త ఉపశమనం కలుగుతుంది..పూర్వ కాలం నుండి ఆయుర్వేద వైద్య విధానంలో మన ఇంట్లో లభించే వస్తువులనే ఈ పచ్చకామెర్ల నివారణకు వినియోగిస్తూ కొంత మేర వ్యాధి నుండి ఉపసమనం పొందుతున్నారు. అయితే ఈ విధానాలు జబ్బు తేలికపాటిదైతేనే కొంతమేర ఫలితాన్ని ఇస్తున్నాయి. అలాంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పచ్చకామెర్లతో బాధపడుతున్న వారికి వేపాకు చక్కని ఔషదంగా పనిచేస్తుంది. వేపాకులో యాంటీ వైరస్ లక్షణాలు కలిగిఉంది. వేపాకుతో తేనెను కలుపుకొని ఒక వారం రోజులు తింటే పచ్చకామెర్ల నుండి విముక్తి పొందవచ్చు..టమోటా లైకో పిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడం జరుగుతుంది. తగిన మోతాదులో వీటిని తీసుకుంటే పచ్చకామర్ల నుండి పోరాడటానికి బాగా సహాయపడుతాయి. ముల్లంగి ద్వారా హెపటైటిస్ కి ఔషదంగా పనిచేస్తుంది. ఉదయం పరగడుపున ముల్లంగిని జ్యూస్ తాగడం వల్ల పచ్చకామెర్లను తగ్గించుకోవచ్చు. అంతేకాక దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చు.

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాలేయ సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయి కాయ, ఆకులు మంచి ఔషధంగా వినియోగించుకోవచ్చు. కాలేయానికి చెరుకు రసంగా ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే కామెర్లు వచ్చిన సందర్భంలో చెరుకురసం సేవించమని సూచిస్తుంటారు. పాలకూర పచ్చకామెర్లతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. లివర్ ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. దీనిలో పీచుపదార్ధాలు శరీరానికి మేలు చేస్తాయి.

పచ్చకామెర్లు కొన్ని సందర్భాల్లో లివర్ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి జబ్బు గుర్తించిన వెంటనే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందటం మేలు. వైద్యుని సూచనల మేరకు ఆహార, పానీయాల విషయంలో నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేకుంటే సమస్య జఠిలమయ్యే ప్రమాదం ఉంటుంది.

×