Winter : చలికాలంలో చర్మ రక్షణ కోసం

కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి.

Winter : చలికాలంలో చర్మ రక్షణ కోసం

Skin Glow

Winter : శీతాకాలంలో చలి కారణంగా చర్మం సమస్యలు మొదలవుతాయి. ఒంట్లో తేమ తగ్గడం కారణంగా చర్మం పొడిబారుతుంది, దురదతో పాటు పగిలిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా కాతివంతమైన చర్మం కావాలనుకుంటే..కొన్ని సూచనలు పాటిస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతం అవుతుంది.శరీరంలో తేమ ఉన్నప్పుడే చర్మం తేజస్సుగా ఉంటుంది. కాబట్టి దానిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందుకే సహజ పద్ధతుల ద్వారా చర్మానికి తేమను అందించడంతో పాటు ఆ తేమ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలంలో అధికంగా లభించే నారింజ తొనలు మన శరీరాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి సహకరిస్తాయి. నారింజ తొక్కచర్మాన్ని స్మూత్‌గా మార్చుతుంది. అయితే వాటిని నేరుగా అప్లై చేయకుండా ముందుగా తొక్కలను ఎండబెట్టుకోవాలి. వాటిని మిక్సిలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఈ నారింజ తొక్కల పొడిలో కొంచెం తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఓ పదినిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడిగెయ్యాలి.

స్నానం చేసేప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ సేపు స్నానం చేయకుండా ఐదు పది నిమిషాల్లో స్నానాన్ని ముగించాలి. చలి ఎక్కువగా ఉంది కదా అని వేడి వేడి నీటితో స్నానం చేస్తారు..అలా కాకుండా గోరువెచ్చటి నీటినే స్నానానికి వినియోగించటం మంచిది. మరిగే నీటిని స్నానానికి వాడటంవల్ల చర్మంలోని సహజసిద్ధమైన నూనెలు కోల్పోయే ప్రమాదం ఉంది. స్నానం చేసిన తరవాత చర్మం పూర్తిగా పొడిబారకముందే శరీరానికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. అలా చేయడం వల్ల తేమను ఎక్కువ సేపు నిలుపుకోగలము.

చర్మానికి మేలు చేసే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. టమోట రసం తీసి అందులో కాస్త పసుపు , పెరుగు కలిపి ముఖానికి రాయాలి. కాసేపటికి ముఖాన్ని కడిగెయ్యాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. చల్లటి నీటిని వాడకుండా గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్‌ సబ్బు, గ్లిజరిన్‌ బేస్‌డ్‌ సబ్బు మంచిది. పెదవులు పగలకుండా పెట్రోలియమ్‌ జెల్లీ లేదా లిప్‌ బామ్‌ను పెదవులపై రాస్తూ ఉండాలి. పాదాలకూ, చేతులకూ కాటన్‌ గ్లౌజ్‌ వేసుకోవడం చాలా మంచిది. అది పగుళ్లను నివారిస్తుంది.

రోజూ రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. అసలే చల్లటి వాతావరణం కారణంగా ఈ కాలంలో నీటిని తాగడం తగ్గుతుంది. కాబట్టి చర్మం పటుత్వాన్ని , తేమను కోల్పోయి మరింత గరుగ్గా కనిపిస్తుంది. అందుకే తగినంత నీరూ తాగాలి. రాత్రి చలిలో బయటికి వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా థిక్‌ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ కేవలం ఎండాకాలంలో మాత్రమే కాదు. ఈ సమయంలోనూ అవసరమేనని గ్రహించాలి. చలికాలంలో ఎండ చురుక్కు మంటుంది. అసలే చర్మం పొడిబారి ఉంటుంది. అది వేడితో మరింత ఇబ్బందిపడకుండా లోషన్స్ రక్షణగా ఉంటాయి.

కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి. పొడిబారిన చర్మానికి త్వరిత ఉపశమనం కలిగించడానికి అలోవెరా జెల్ చక్కటి పరిష్కారం. అలోవెరా జెల్ లో ఉండే యాసిడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ ని నాశనం చేస్తాయి.

కీరోదసకాయలో 80శాతం నీళ్ళు ఉంటాయి. డ్రై స్కిన్ కు ఇది బెస్ట్ చాయిస్, ఇది డ్రై స్కిన్ నివారిస్తుంది, స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. చర్మంలో తేమను రీస్టోర్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మంను స్మూత్ గా ఉంచుతుంది. సన్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది. అరటిపండును బాగా మెత్తగా చేసి అందులో తాజాగా ఉన్నటువంటి స్వీట్ క్రీమ్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట పాటు అలా ఉండాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా.. మృదువుగా ప్రకాశంతంగా మారుతుంది.