Lips : పెదవుల అందం కోసం!..

నకిలీ లిప్ స్టిక్స్ పెదవులకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. పెదవులు నల్లబడేట్టు చేయడమే కాకుండా కొన్నిసార్లు  క్యాన్సర్‌ కు దారితీసే అవకాశం ఉంది. రాత్రి నిద్రపోయే ముందు మీ పెదాలను నీటిలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి.

Lips : పెదవుల అందం కోసం!..

Lips

Lips : ముఖానికి అందాన్ని తెచ్చిపెట్టేవి పెదవులు. పెదవులు ఎర్రగా, మృదువుగా అందంగా కనిపిస్తే ముఖం కళకళలాడుతూ ఉంటుంది. చాలా మంది పెదవులకు రకరకాల లిఫ్టిక్టులు వేస్తూ పెదవులను కళావిహానంగా మార్చేస్తుంటారు. దీనివల్ల క్రమేపి ఎర్రని సహజసిద్ధమైన పెదవులు కాస్త నల్లగా మారిపోతాయి. ఆతరువాత తమ పెదవులు తిరిగి ఆకర్షణీయంగా మార్చుకునేందుకు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు.

పెదవులు అందం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే లిప్‌ స్టిక్‌ ని అప్లై చేసే ప్రతీసారి సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడాలి. పెదాలు ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలంటే ఐరన్‌తో పాటు సి, ఇ విటమిన్లు పెదవుల అందాన్ని కాపాడుతాయి. ఎక్కువ మొత్తం ఫలాలను, కాయగూరలు, క్యారెట్‌ , ఆరెంజ్‌ రసాలని తాగాలి. అర టీస్పూన్ గ్లిజరిన్, ఆముదం, నిమ్మరసం తీసుకుని, వీటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా చేయడం ద్వారా పెదాలపై పేరుకుపోయిన ట్యాన్‌ తొలగిపోతుంది.

నకిలీ లిప్ స్టిక్స్ పెదవులకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. పెదవులు నల్లబడేట్టు చేయడమే కాకుండా కొన్నిసార్లు  క్యాన్సర్‌ కు దారితీసే అవకాశం ఉంది. రాత్రి నిద్రపోయే ముందు మీ పెదాలను నీటిలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పెదవులకు నూనె రాసుకొని అయిదు నుంచి పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో అవి ఆరోగ్యంగా, అందంగా తయారవుతాయి.

నిమ్మకాయ ముక్కపై పంచదార అద్ది పెదవులపై గుండ్రంగా రుద్దాలి.ఇలా పది నిమిషాల పాటు చేసి చల్లని నీటితో కడిగేస్తే పెదవుల తేమ పోకుండా ఉంటుంది. పెరుగుపై ఉండే మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి. సన్‌స్క్రీన్ ఉన్న లిప్ బామ్ వాడితే.ఎండ నుంచి మీ పెద‌వుల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఆరెంజ్‌ రసం కలిగిన లిప్‌బామ్‌ సూర్యుని నుంచి వెలువడే ప్రమాధకర కిరణాల నుంచి రక్షణ కల్పించి సహజ కండిషనింగ్‌లా పనిచేస్తుంది.