Lemon : యవ్వనానికి… నిమ్మ తోడు!..

నిమ్మలోని విటమిన్ సి చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించటంలో సహాయపడుతుంది. నిమ్మకు కొబ్బరి నీరు తోడవ్వటంతో చర్మంలో మెరుపు సంతరించుకుంటుంది.

Lemon : యవ్వనానికి… నిమ్మ తోడు!..

Citric

Lemon : యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభించే పండ్లలో నిమ్మకాయ ఒకటి. నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆయుర్వేదంలో నిమ్మకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులోని ఔషదగుణాలు ఆరోగ్యసమస్యలకు ఎంతగానో ఉపకరిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు నిమ్మను ఎక్కవగా వాడుతుంటారు. శరీర జీర్ణక్రియలలో ఇది సహాయకారిగా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మసౌందర్యాన్ని పెంపొందించటంలో నిమ్మ దోహదపడుతుంది.

చర్మాన్ని మృదుత్వంగా ఉంచటంలో నిమ్మను మించింది లేదు. వేడి నీళ్లలో కొన్ని నిమ్మ చెక్కలను వేసి పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. నిమ్మరసం పిండిన తరువాత ఆతొక్కలను పాదాలకు రుద్దినా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇలా చేయటం వల్ల నిమ్మలోని హైడ్రాక్సీ ఆమ్లాలు బిగుతు చర్మాన్ని మెత్తగా మారుస్తాయి. యవ్వనంగా కనిపించాలనుకునే వారు చెంచా కొబ్బరి నూనెకు , రెండు చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి మర్ధన చేసుకోవాలి. పది నిమిషాల తరువాత మొఖాన్ని చల్లిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా కనిపిస్తుంది.

నిమ్మలోని విటమిన్ సి చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించటంలో సహాయపడుతుంది. నిమ్మకు కొబ్బరి నీరు తోడవ్వటంతో చర్మంలో మెరుపు సంతరించుకుంటుంది. జుట్టు ఒత్తుగా మార్చటంతోపాటు చుండ్రు వంటి సమస్యలను పోగొట్టటంలో నిమ్మ బాగా పనిచేస్తుంది. రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా అలివ్ నూనె, ఒక చెంచా సముద్రపు ఉప్పు బాగా కలిపి తలకు పట్టించాలి. పదినిమిషాల తరువాత స్నానం చేస్తే కేశ రంధ్రాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. జట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఆరోగ్యంగా జుట్టు పెరుగుతుంది. అందుకే నిమ్మను సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు.