Friendship to Relationship: ఫ్రెండ్‌.. లవర్ అవడం ఎంతవరకూ కరెక్ట్

ఏ పని చేసినా సొసైటీని.. మన చుట్టూ ఉన్న పరిస్థితులని బట్టి చేస్తుంటాం. రొమాంటిక్ యాంగిల్ లో అయితే పూర్తిగా కొత్తవాళ్లనే ఎంచుకోవాలని చాయీస్ తీసుకుంటారు. మనం డేటింగ్ లేదా ప్రేమించే వ్యక్తి గుడ్ పార్టనర్ అవుతారో లేదోననే అనుమానంతోనే కొత్త వ్యక్తులను ఎంచుకుంటారు.

Friendship to Relationship: ఫ్రెండ్‌.. లవర్ అవడం ఎంతవరకూ కరెక్ట్

Friend To Lover

Friendship to Relationship: ఏ పని చేసినా సొసైటీని.. మన చుట్టూ ఉన్న పరిస్థితులని బట్టి చేస్తుంటాం. రొమాంటిక్ యాంగిల్ లో అయితే పూర్తిగా కొత్తవాళ్లనే ఎంచుకోవాలని చాయీస్ తీసుకుంటారు. మనం డేటింగ్ లేదా ప్రేమించే వ్యక్తి గుడ్ పార్టనర్ అవుతారో లేదోననే అనుమానంతోనే కొత్త వ్యక్తులను ఎంచుకుంటారు. ఎందుకంటే తెలిసిన వాళ్లు, ఫ్రెండ్స్ తో డేటింగ్ చేయకూడదని సామాజికంగా మనం కట్టుబాటు పెట్టేసుకున్నాం కాబట్టి. ఇది చాలా పెద్ద తప్పని స్టడీ చెప్తుంది.

సోషల్ సైకాలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్ చెప్తున్న దానిని బట్టి ఇది తప్పు. సుదీర్ఘకాలం పాటు కలిసి ఉన్న రిలేషన్‌షిప్స్ అన్నీ ఫ్రెండ్‌షిప్‌తో మొదలైనవే. 2002 నుంచి 2020 వరకూ మధ్య కాలంలో జరిపిన ఏడు స్టడీల్లో 1897మందిపై నిర్వహించిన స్టడీల్లో తేలిందిదే.

చదువు, జెండర్, సంప్రదాయాలు లాంటి కొద్ది పాటి వ్యత్యాసంతోనే రిలేషన్ మొదలవుతుంది. వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ సేమ్ జెండర్ అయితే అలా కంటిన్యూ అయినా.. మగాఆడలో మాత్రం డేటింగ్ లేదా లవ్‌కు దారి తీస్తుందని తెలిసింది.

అదెలా:
ఒక ఫ్రెండ్.. రొమాంటిక్ పార్టనర్ గా మారే ప్రక్రియ చాలా నిదానంగా జరుగుతుంది. చాలా మంది యూనివర్సిటీ స్టూడెంట్లలో కనీసం సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకూ వారి మధ్య రొమాంటిక్ ఫీలింగ్‌యే మొదలుకాని వాళ్లు ఉన్నారు. అది మొదలయ్యాక మాత్రం ఎటువంటి హద్దులు లేకుండా ఉండగలుగుతున్నారు.

దీనిపై రచయితలు రీసెర్చ్ చేసి.. ఫ్రెండ్‌షిప్ నుంచి రిలేషన్‌షిప్‌గా ఎలా మారిందో తెలుసుకోవాలని ప్రయత్నించారు. కొత్త వ్యక్తుల మధ్య ప్రేమ, రొమాంటిక్ రిలేషన్‌షిప్ చాలా త్వరగా మొదలవుతుంది. కాకపోతే ఓ ఫ్రెండ్.. రొమాంటిక్ పార్టనర్ అవడానికి చాలా సమయమే పడుతుందట. ‘ఒక ఫ్రెండ్ నుంచి రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ముందే తెలిసిన వ్యక్తితో చేసే ప్రయాణం చాలా అద్భుతంగా జరుగుతుంది’ అని స్టడీ నిర్వాహకులు తేల్చారు.