Gas Problem: కడుపులో గ్యాస్ సమస్యగా మారిందా.. జాగ్రత్తలివే

గుండె పట్టేస్తున్నట్లు అనిపించడానికి ఎసిడిటీ ప్రాబ్లమ్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు కావొచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు. అందుకు పీహెచ్‌ హై లోడింగ్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌, ఒత్తిడితో కూడిన ఉద్యోగం వీటిలో కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు.

Gas Problem: కడుపులో గ్యాస్ సమస్యగా మారిందా.. జాగ్రత్తలివే

Gas Problem

Gas Problem: గుండె పట్టేస్తున్నట్లు అనిపించడానికి ఎసిడిటీ ప్రాబ్లమ్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు కావొచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు. అందుకు పీహెచ్‌ హై లోడింగ్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌, ఒత్తిడితో కూడిన ఉద్యోగం వీటిలో కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు.

బిర్యానీ లాంటివి తీసుకుంటే నూనెతోపాటు ప్రొటీన్‌ అధికంగా చేరి జీర్ణవ్యవస్థ మీద అధిక భారం పడుతుంది. దాని జీర్ణించుకోవడానికి ఎక్కువ మోతాదులో యాసిడ్‌లు విడుదల చేస్తుంది జీర్ణ వ్యవస్థ. ఇటువంటి ఆహారమే తరచుగా తీసుకుంటే గ్యాస్‌ సమస్య ఎక్కువై ఛాతీ నొప్పి వస్తుంది. సమయానికి తినకపోయినా కూడా నొప్పి రావొచ్చు.

మెడికల్ టెస్టులు నిర్వహించి.. ఏ కారణంవల్ల సమస్య వస్తుందో డాక్టర్లు గుర్తించి చెబుతారు. వారి సూచనల మేరకే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

Read Also: గ్యాస్ స‌మ‌స్య ఎంత‌కూ వ‌దిలిపెట్ట‌డం లేదా..?

మిరప, గరమ్‌ మసాలా ఎక్కువగా తీసుకున్నప్పుడూ కాఫీ తాగినప్పుడూ అలాగే ఆయిల్‌, ప్రొటీన్‌ ఫుడ్ అంటే మటన్‌, చికెన్‌, గ్రేవీ కర్రీ, నట్స్‌ ఉపయోగించి చేసిన మసాలా కర్రీ.. వీటిలో కొవ్వులు ఎక్కువ ఉండటంవల్ల జీర్ణవ్యవస్థ ఎక్కువ శ్రమ పడాలి. అలాంటప్పుడు అవసరానికి మించి యాసిడ్‌ ఉత్పత్తి అయి ఛాతీ నొప్పి వస్తుంది.

లైఫ్‌స్టైల్‌లో, ఆహారంలో మార్పులు చేసుకుని సమస్యని పరిష్కరించుకోగలం.

నడుము కొలత మగవాళ్లలో 90 సెం.మీ, ఆడవాళ్లలో 80 సెం.మీ. కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. కొందరిలో నడుము, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా చేరి జీర్ణకోశం, పేగుల మీద కొవ్వు పేరుకుంటుంది. సెంట్రల్‌ ఒబెసిటీ అనే ఈ సమస్యతో జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది.

లివర్‌లో, పాంక్రియాస్‌లో కొవ్వు ఎక్కువైనా డైజెషన్‌ సులభంగా జరగదు. అదనపు బరువు, నడుము కొలత తగ్గించుకోండి.

శుభ్రమైన, తాజా ఆహారాన్నే తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ మీద భారం పడకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోండి. తిన్నాక 10 – 15 నిమిషాలు నడవాలి. రోజులో కనీసం 10వేల అడుగులు వేయాలి. వీటితోపాటు ఏం తిన్నప్పుడు సమస్య వస్తుందో పరిశీలించుకుని కూడా మార్పులు చేసుకోవాలి.