Dry Ginger : కఫాన్ని తగ్గించటంతోపాటు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచే శొంఠి!

గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్య ఉంటే. గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియలు వేగవంతం అవుతాయి.

Dry Ginger : కఫాన్ని తగ్గించటంతోపాటు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచే శొంఠి!

dry ginger

Dry Ginger : శొంఠి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శొంఠి పొడి దీర్ఘకాలిక అజీర్ణం వల్ల కడుపు నొప్పి , కడుపులో అసౌకర్యం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే అలాంటి సీజ‌న‌ల్ వ్యాధుల‌ను నివారించ‌డంలో శొంఠి అద్భుతంగా తోడ్పడుతుంది. సాధారణంగా ఎక్కవ మంది అల్లాన్ని వాడుతుంటారు. అయితే అల్లం వాతాన్ని పెంచుతుంది. దానికి బదులుగా శొంఠిని ఉపయోగిస్తే వాతాన్ని సమతుల్యం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. శొంఠి కఫాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. శొంఠిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది, ఉదయాన్నే విరోచనం సాఫీగా జరగాలంటే శొంఠి పొడి కలిపిన నీరు తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్య ఉంటే. గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియలు వేగవంతం అవుతాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో శొంఠి పొడి కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శొంఠిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

శొంఠి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కొద్దిగా శొంఠి పొడిని గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పుతో కలిపి తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శొంఠిను ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇది ముఖ్యంగా కీళ్ళు , వేళ్ళలో వాపును తగ్గిస్తుంది. గాయాల వల్ల కలిగే వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు.

శొంఠిని కషాయంగా తయారు చేసుకోవాలనుకుంటే ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు తీసుకుని, 1 చిటికెడు శొంఠి పొడి వేసి మరిగించండి. దానిలో 1 గ్లాసు నీరు మిగిలే వరకు మరిగించాలి.
అనంతరం గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి.