Covid Global Hotspots Strains : కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ల గ్లోబల్ హాట్‌స్పాట్‌లు.. టాప్ లిస్టులో చైనా..!

ప్రపంచంలో పెనుమార్పులతో కొత్త కొత్త ప్రాణాంతక కరోనావైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. భూ వినియోగ విధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిలో విపత్తులకు దారితీస్తోంది.

Covid Global Hotspots Strains : కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ల గ్లోబల్ హాట్‌స్పాట్‌లు.. టాప్ లిస్టులో చైనా..!

Covid Global Hotspots Strains

Global Hotspots For New Coronavirus Strains : ప్రపంచంలో పెనుమార్పులతో కొత్త కొత్త ప్రాణాంతక కరోనావైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. భూ వినియోగ విధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిలో విపత్తులకు దారితీస్తోంది. ప్రపంచంలో ఎక్కెడక్కడా కరోనావైరస్‌లు ఉద్భవించే హాట్ స్పాట్‌లు ఉన్నాయో కొత్త అధ్యయనం గుర్తించింది. దీనికి సంబంధించి ఒక జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ దేశాల్లో కంటే చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత భారతదేశంలోని కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో కరోనావైరస్ హాట్‌స్పాట్‌లుగా పేర్కొంది. కాలిఫోర్నియా యూనివర్శిటీ, బర్కిలీ, పాలిటెక్నికో డి మిలానో (పాలిటెక్నిక్ యూనివర్శిటీ ఆఫ్ మిలన్) మాస్సే యూనివర్శిటీ ఆఫ్ న్యూ జిలాండ్, నేచర్ ఫుడ్‌లో కరోనావైరస్ గ్లోబల్ హాట్ స్పాట్‌లను ప్రచురించింది.

అధ్యయనం ప్రకారం.. అటవీ విచ్ఛిన్నం, వ్యవసాయ విస్తరణ, పశువుల ఉత్పత్తి అన్నీ మానవులను గుర్రపుడెక్క (Rhinolophid bats) గబ్బిలాలతో దగ్గరి సంబంధం ఉందని గుర్తించారు. కొవిడ్ -19 తో సహా జూనోటిక్ వ్యాధులను వ్యాపించేస్తాయని తేలింది. అంటు వ్యాధులు గబ్బిలాల నుంచి మానవులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చైనాలోని మాంసం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ఒక కారణమైతే.. పెద్ద ఎత్తున పారిశ్రామిక పశువుల పెంపకాన్ని విస్తరించడం ఈ ప్రాణాంతక వైరస్‌లకు దారితీసిందని అధ్యయనం పేర్కొంది. పశువుల ఉత్పత్తి ఆందోళన కలిగించే కారణంగా చెబుతున్నారు. వ్యాధుల వ్యాప్తికి ఎక్కువగా గురవుతాయని పరిశోధకులు వెల్లడించారు.

చైనా వెలుపల ఉన్న ఇతర ప్రధాన ప్రపంచ హాట్‌స్పాట్‌లలో జావా, భూటాన్, తూర్పు నేపాల్, ఉత్తర బంగ్లాదేశ్, కేరళ రాష్ట్రం (భారతదేశం), ఈశాన్య భారతదేశమని పరిశోధకులు తెలిపారు. దక్షిణ చైనాలో తక్కువ రిస్క్ ‘కోల్డ్‌స్పాట్‌లు’ ఉన్నప్పటికీ.. షాంఘైకి దక్షిణంగా దేశంలోని కొన్ని ప్రాంతాలు, జపాన్, ఉత్తర ఫిలిప్పీన్స్ కూడా అటవీ విచ్ఛిన్నంతో హాట్‌స్పాట్‌లుగా మారే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. ఇండోచైనా, థాయిలాండ్ ప్రాంతాత్లో పశువుల ఉత్పత్తి పెరుగుదల కారణంగా హాట్ స్పాట్లుగా మారవచ్చునని అధ్యయనం తెలిపింది.

పశ్చిమ ఐరోపా నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించిన గుర్రపుడెక్క గబ్బిలాల పరిధిలో భూ వినియోగ శాంపిల్స్ విశ్లేషించేందుకు పరిశోధకులు రిమోట్ సెన్సింగ్‌ను ఉపయోగించారు. ఈ బృందం అటవీ విచ్ఛిన్నం, వ్యవసాయ, పశువుల ఉత్పత్తి ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాలను గుర్రపుడెక్క గబ్బిలాల ఆవాసాలతో పోల్చి చూశారు. గుర్రపుడెక్క కుటుంబంలో (రినోలోఫిడే) ఈ బ్యాట్ జాతులకు ఆవాసాలుగా ఉన్నాయని గుర్తించారు. జూనోటిక్ వైరస్ గబ్బిలాల నుంచి మానవులకు వ్యాపించగలవని అంటున్నారు.

ప్రపంచంలోని అన్ని సకశేరుకాలలో, ఎలుకలు, గబ్బిలాలు చాలా ఉన్నాయి. ఈ వైరస్ లతో మానవులు చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ గబ్బిలాలు SARS-COV2, MERS, CoV ఎబోలా వంటి కరోనావైరస్ల వాహకాలుగా మారుతున్నాయి. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, కేరళలో నిపా వైరస్ విజృంభణకు ఈ తరహా వాహకాలే కారణమని అంటున్నారు. దేశంలో ఎక్కడో జరిగితే అది దేశమంతా ప్రభావితమవుతుందని హెచ్చరిస్తున్నారు.

బ్యాట్ వైరస్‌లు మానవులకు ఎలా ఎక్కడా సంక్రమిస్తాయో ఊహించడం దాదాపు అసాధ్యమని పరిశోధకులు చెబుతున్నారు. కానీ గబ్బిలాలు లేనిచోట అలాంటి వైరస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉండొచ్చునని అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు గబ్బిలాలకు ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల ప్రదేశాలగా పేర్కొన్నారు. జూనోటిక్ వ్యాధులు రాకుండా నిరోధించడానికి మరింత జాగ్రత్తగా ఉండాలని, పర్యావరణ సమతుల్య పద్ధతిలో మార్చాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.