Go Corona, Go! Gavi : గో కరోనా.. గో.. గవి.. ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు లేదు.. ఎలా కట్టడి చేశారంటే?

గో.. కరోనా గో.. ఆ ఊళ్లో వెయ్యిమంది జనాభా.. మనిషికి మనిషికి మధ్య.. ఊరికీ ఊరికీ ఉండేంత దూరం ఉంటుంది. సోషల్‌ డిస్టెన్స్ పాటిస్తారు.. మాస్కులు ధరిస్తారు.. శానిటైజర్లు వాడటం వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదు.

Go Corona, Go! Gavi : గో కరోనా.. గో.. గవి.. ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు లేదు.. ఎలా కట్టడి చేశారంటే?

Go Corona, Go! Gavi, A Forest Village In Kerala Has No Covid Patients

Gavi has no Covid patients : గో.. కరోనా గో.. ఆ ఊళ్లో వెయ్యిమంది జనాభా.. మనిషికి మనిషికి మధ్య.. ఊరికీ ఊరికీ ఉండేంత దూరం ఉంటుంది. సోషల్‌ డిస్టెన్స్ పాటిస్తారు.. మాస్కులు ధరిస్తారు.. శానిటైజర్లు వాడటం వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. శ్రీలంక నుంచి వచ్చి స్థిరపడ్డారు.. తమిళ కుటుంబాలతో ఉండే ‘గవి’ గ్రామం ఇది.. కేరళలోని పట్టణంతిట్ట జిల్లాలో ఈ గ్రామం ఉంది..

ప్రపంచమంతా ఉన్న కరోనా వైరస్.. ఆ గ్రామంలో మాత్రం అడుగుపెట్టాలంటే హాడల్.. అవును. ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాలేదు.. టీవీలు, పేపర్లు, సెల్‌ ఫోన్లు, లేవు.. కరోనా వార్తలు గురించే వారికి తెలియదు.. వారికి తెలిసింది ఒక్కటే.. క్రమశిక్షణ.. గవి పాటించే కోవిడ్ నిబంధనలతోనే కరోనాను తమ ఊరి పొలిమేరల్లోకి కూడా అడుగుపెట్టనీయలేదు. అంతగా కట్టడి చేశారు.

గ్రామస్థులే కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు.. వస్తున్న ఒకటీ అరా జ్వరాలు కూడా సాధారణమే.. వాటికి మందులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. గవి అంతటా పచ్చదనమే. ప్రభుత్వం కల్పించిన అవగాహనతో కరోనాను కట్టడి చేయగలిగారు. వెయ్యి జనాభా అంటే మనిషికి మనిషికి మధ్య ఊరికీ ఊరికీ ఉన్నంత దూరం ఉంది.

అందులోనే సామాజిక దూరాన్ని పాటిస్తున్నారంతా. మాస్కులు లేకుండా బయటకు రారు.. చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేయాల్సిందే.. ఊరి నుంచి బయటకు వెళ్లరు.. బయటి నుంచి ఊళ్లోకి రానివ్వరు. గవి గ్రామంలోని ఇంట్లోనూ టీవీలు లేవు.. వైరస్‌ వార్తల్ని వినే పరిస్థితి లేదు. అందుకే వారిలో కరోనా గురించి ఆందోళన లేదు. ఇంటర్నెట్‌ లేని గవిలో ఒకే ఒక మందుల దుకాణం ఉంది. వ్యాక్సినేషన్‌ కూడా మొదలైంది.