ఇంకెక్కడి ప్రైవసీ : మీ వాట్సాప్ గ్రూపు గుట్టు.. గూగుల్‌లో రట్టు!

మీకు వాట్సాప్ అకౌంట్ ఉందా? అయితే ఏదో ఒక గ్రూపు కచ్చితంగా ఉండే ఉంటుంది. మీ ప్రైవేటు గ్రూపు కావొచ్చు.. లేదా పబ్లిక్ గ్రూపు, ప్రొఫెషనల్ గ్రూపు ఇలా ఏదైనా కావొచ్చు. మీ వాట్సాప్ నెంబర్ క

ఇంకెక్కడి ప్రైవసీ : మీ వాట్సాప్ గ్రూపు గుట్టు.. గూగుల్‌లో రట్టు!

Whatsapp:మీకు వాట్సాప్ అకౌంట్ ఉందా? అయితే ఏదో ఒక గ్రూపు కచ్చితంగా ఉండే ఉంటుంది. మీ ప్రైవేటు గ్రూపు కావొచ్చు.. లేదా పబ్లిక్ గ్రూపు, ప్రొఫెషనల్ గ్రూపు ఇలా ఏదైనా కావొచ్చు. మీ వాట్సాప్ నెంబర్ కు ఎవరో ఒకరు గ్రూపు ఇన్వెటేషన్ లింక్ పంపుతుంటారు. గ్రూపు చాట్ బాక్సుల్లో వచ్చిన ఇన్విటేషన్ లింకుల ద్వారా ఒక్కో గ్రూపులోకి సభ్యులు చేరిపోతుంటారు. ఇంతకీ మీరు చేరిన గ్రూపుల్లో అంతా మీవాళ్లే ఉన్నారని అనుకుంటున్నారా?

మీరు వాడే వాట్సాప్ గ్రూపులు సురక్షితమేనా? అంటే.. వాట్సాప్ ఎండ్ టూ ఎన్ క్రిప్షన్ మెసేజ్‌లు కదా? అసలు బహిర్గతమయ్యే అవకాశమే లేదంటారా? అయితే మీరు మీ ప్రైవసీ కోల్పోయినట్టే… తప్పులో కాలేసినట్టే. మీకు తెలియకుండానే మీ వాట్సాప్ గ్రూపులో గుర్తుతెలియని వ్యక్తులు చేరిపోతున్నారట. అంతేకాదు.. మీ గ్రూపు సభ్యుల వివరాలను ఆన్ లైన్ లో బహిర్గతం చేస్తున్నారంట. వాట్సాప్ గ్రూపు చాట్స్ లో ఉండే ఇన్విటేషన్స్ లింక్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఈజీగా ఇండెక్స్ అవుతాయి.

ఈ లింకుల ద్వారా ఎవరైనా ఏ గ్రూపులో చేరాలంటే ఆ గ్రూపులో ఈజీగా చేరిపోవచ్చు. వాట్సాప్ గ్రూపులో చేరాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫోన్ నెంబర్ సాయంతో నేరుగా గ్రూపులోకి చేరిపోవడం.. ఇక రెండోది.. ఇన్విటేషన్ లింకుల ద్వారా గ్రూపులోకి చేరే అవకాశం ఉంది. వాట్సాప్ గ్రూపు ఇన్విటేషన్ లింకులు గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అవుతున్నాయట. ఎవరైనా ఈ లింకులను గూగుల్ సెర్చ్ ద్వారా గుర్తించి వెంటనే ఆయా గ్రూపులో చేరే అవకాశం ఉంది. అంతేకాదు.. గ్రూపు సభ్యుల ఫోన్ నెంబర్లు.. వారి చాట్ వివరాలను కూడా బహర్గితం చేసే ప్రమాదం ఉందని జర్నలిస్ట్ జార్డన్ విల్డన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

వాట్సాప్ గ్రూపు సభ్యులు ఇన్విటేషన్ లింకులను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినప్పుడే ఈ సమస్య ఎదురువుతోందని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ 4,70,000 వాట్సాప్ గ్రూపుల వివరాలు గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయినట్టు విల్డన్ తెలిపారు. వాట్సాప్ గ్రూపులో ఎవరికైనా పర్సనల్ గా ఇన్విటేషన్ లింక్ పంపితే ఇబ్బందేమి ఉండదని అంటున్నారు. అలా కాకుండా ఆయా లింకులను సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో పోస్టు చేస్తే గూగుల్ సెర్చ్ లో మీ వ్యక్తిగత వివరాలు కూడా బహిర్గతమవుతాయని విల్డన్ హెచ్చరిస్తున్నారు.