Yoga : జీర్ణశక్తిని పెంచి, శృంగార సమస్యలు తొలగించే గోరక్షాసనం!

ఈ ఆసనం వేయడం వల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. శృంగార సమస్యలు పోతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. క్రమం తప్పకుండా రోజూ వేస్తుంటే స్త్రీలలోనూ గర్భాశయ సమస్యలు పోతాయి.

Yoga : జీర్ణశక్తిని పెంచి, శృంగార సమస్యలు తొలగించే గోరక్షాసనం!

Gorakshasanam

Yoga : ఆరోగ్యవంతమైన జీవితానికి యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయి. రోజువారి వ్యాయామంలో భాగంగా యోగాసనాలను సాధన చేయటం వల్ల శరీర ఆరోగ్యంతోపాటు, మెదడుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. యోగాలో అనేక రకాల అసనాలు ఉన్నాయి. ఒక్కో ఆసనానిది ఒక్కో ప్రత్యేకత. దేని ప్రయోజనాలు దానివే. ముఖ్యంగా పురుషుల్లో జీర్ణశక్తి, శృంగార సమస్యలు ఇబ్బందికలిగిస్తుంటాయి. ఈ సమస్యల నుండి బయటపడేందుకు యోగాలో గోరక్షాసనం ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ సమస్యల నుండి సులభంగా బయటపడేందుకు రోజువారిగా గోరక్షాసనం సాధన చేయటం మంచిదని యోగానిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఆసనం వేయడం వల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. శృంగార సమస్యలు పోతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. క్రమం తప్పకుండా రోజూ వేస్తుంటే స్త్రీలలోనూ గర్భాశయ సమస్యలు పోతాయి. పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణాశయంలో ఉండే గ్యాస్ సమస్య తొలగిపోతుంది. సంతాన లోపం ఉన్నవారు ఈ ఆసనం వేస్తే మంచి ఫలితం ఉంటుంది. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, మడమల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం వేయటం వల్ల వాటి నుండి ఉపశమనం పొందవచ్చు.

గోరక్షాసనం వేసే విధానం ;

ముందుగా నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. కాళ్ళను దగ్గరగా వచ్చేలా ముందుకు మడిచి పెట్టుకుని నిటారుగా కూర్చోవాలి. రెండు పాదాలనూ కలిపి, పిరుదుల్ని కొద్దిగా పైకి లేపాలి. చేతుల్ని నమస్కారం ముద్రలో ఉంచాలి. ఇలాగే ముప్పై సెకన్ల నుండి నిమిషం వరకూ ఈ ఆసనంలో ఉండాలి. కొవ్వు అధికంగా వున్నవాళ్లు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ ఆసనాన్నియోగా శిక్షకుల సమక్షంలో జాగ్రత్తగా వేయాలి.