చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు

చర్మం యవ్వనంగా కనిపించేందుకు రెండు స్పూన్ల ద్రాక్ష గుజ్జులో ఒక స్పూను మీగడ, ఒక స్పూను బియ్యం పిండి, క్యారెట్ రసం కలుపుకోవాలి. దీన్ని మెత్తగా చేసి ముఖానికి రాసి అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు

Grape Face Packs

ద్రాక్షా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఆహారంగా తీసుకోవటం తోపాటు వీటితో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ద్రాక్షతో తయారు చేసిన పూతలతో అందాన్ని పెంపొందించుకోవచ్చు. శరీర ఆరోగ్యంతోపాటు చర్మ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. జిడ్డు చర్మతత్వం ఉన్న వారికి ద్రాక్షతో తయారు చేసుకున్న మిశ్రమ పూతలు ఎంతో దోహదపడతాయి. చర్మానికి ద్రాక్ష తో ఎలాంటి పూతలు తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం…

ఒక గిన్నెలో కొన్ని ద్రాక్ష పళ్లు తీసుకుని బాగా చిదమాలి. దీనికి చెంచా చొప్పున మిల్తనీ మట్టి, నిమ్మరసం, గులాబీ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత కడిగే్స్తే సరిపోతుంది. జిడ్డు పూర్తిగా తొలగి చర్మం తాజాగా , కాంతివంతంగా మారుతుంది. పొడి చర్మతత్వం ఉన్నవారు రెండు చెంచాల ద్రాక్ష గుజ్జులో చెంచా చొప్పున బొప్పాయి గుజ్జు, తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిపోయాక చల్లని నీటితో కడుక్కోవాలి. ఇందులో ఉండే తేనె సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసి ముఖాన్ని పొడిబారనివ్వకుండా చేస్తుంది. ద్రాక్ష సహజ క్లెన్సర్ గా పనిచేసి ముఖాన్ని శుభ్రం చేస్తుంది.

అలాగే ఒక గిన్నెలో కొ్న్ని ద్రాక్ష పండ్లను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దానికి చెంచా ఆలివ్ అయిల్, అరస్పూన్ పాలు, వంట సోడా కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ముఖం అందంగా మారుతుంది. ముఖంపై జిడ్డు, పేరుకున్న మురికీ పోవాలంటే మూడుచెంచాల ద్రాక్ష పండ్ల గుజ్జులో స్పూను పొదీనా ఆకుల ముద్ద, నిమ్మరసం వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని గులాబీ నీటితో ముఖాన్ని తుడుచుకోవాలి.

చర్మం యవ్వనంగా కనిపించేందుకు రెండు స్పూన్ల ద్రాక్ష గుజ్జులో ఒక స్పూను మీగడ, ఒక స్పూను బియ్యం పిండి, క్యారెట్ రసం కలుపుకోవాలి. దీన్ని మెత్తగా చేసి ముఖానికి రాసి అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మెరుపును సంతరించుకుంటుంది.