Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!

ప్రతిరోజు గ్రీ టీ తాగేవారిలో గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.

Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!

Diabetes

Green Tea : మధుమేహం ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే తీసుకునే ఆహారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. తక్కువ కేలరీలు మరియు యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే గ్రీన్ టీ గ్రీన్ టీ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. స్థూలకాయం తగ్గించుకునేందుకు, రక్తపోటు నియంత్రణకు ఇలా చాలా రాల ఆనారోగ్య సమస్యలు దూరం చేస్తుంది.

గ్రీన్ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. జీవక్రియను ప్రేరేపించి బరువు తగ్గేలా చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ఉన్నవారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే..మీ శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. గ్రీన్ టీలో కొటేకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారు ప్రతిరోజు రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ప్రతిరోజు గ్రీ టీ తాగేవారిలో గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. గ్రీన్ టీ లో లెథినిన్ అనే ఎమైనో ఆమ్లము ఉండటం వల్ల ఇది మెదడు చురుకుగా పనిచేయడానికి దోహద పడుతుంది. కాఫీ లో ఉండే కెఫిన్ మోతాదు కన్న గ్రీన్ టీ లో కెఫిన్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల మెదడు చురుకుదనంగా మారుతుంది.

గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రొమ్ము క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ వంటివి రాకుండా కాపాడుతుంది. గ్రీన్ టీ అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తుంది. గ్రీన్ టీ చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. గ్రీన్ టీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది వేడి నీళ్లు,ఒక గ్రీన్ టీ బ్యాగ్. సింపుల్ గానే వేడి వేడి గ్రీన్ టీ తయారు చేసుకోవచ్చు.