Foot Cracks : పాదాల పగుళ్లు నిరోధించే గ్రీన్ టీ!

గ్రీన్ టీలో ఉండే విటమిన్ ఇ పాదాలకు తేమను అందించటంతోపాటు, ఎండ, చెమట కారణంగా వచ్చే అలర్జీలను దరిచేరకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పాదాల రక్షణకు తోడ్పడతాయి.

Foot Cracks : పాదాల పగుళ్లు నిరోధించే గ్రీన్ టీ!

Green Tea

Foot Cracks : శరీరంలోని ఇతర భాగాల కంటే పాదాల చర్మం మందంగా ఉంటుంది. చలి, తీవ్రమైన వేడి కారణంగా పాదాలు దెబ్బతింటాయి. చర్మం పొడిబారిపోతుంది. కొంతమందిలో పాదాల్లో పగుళ్లు ఏర్పడతాయి. పాదాల చర్మంపై, ముఖ్యంగా మడమలు, కాలి చుట్టూ చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. ఈ మృత కణాలను విచ్ఛినం చేయటం ఫుట్ క్రీముల వల్ల సాధ్యమయ్యేది కాదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మృతకణాలు పాదాల చుట్టూ దట్టంగా పేరుకుపోయి గట్టిగా మారతాయి. దీని వల్ల కాళ్ల పగుళ్ళు ఏర్పడతాయి. నడిచే సందర్భంలో పగిలిన కాళ్లు ఇబ్బందిని కలిగిస్థాయి.

పాదాల ఆరోగ్యానికి సంబంధించి గ్రీన్ టీ ఎంతగానో దోహదపడుతుంది. గ్రీన్ టీతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. చర్మం నిగారింపును మెరుగు పచటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడి ముడతలను, మంటను తగ్గిస్తుంది. పాదాలను సంరక్షించడంలోనూ గ్రీన్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్‌ టీలో కాసేపు పాదాలను ఉంచితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పాదాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తాయి. బరువును అదుపులో ఉంచటానికి, ఆరోగ్యానికి గ్రీన్ టీ వల్ల ప్రయోజనం ఉంటుందని మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే గ్రీన్ టీ వల్ల పాదాల అందాన్ని మెరుగుపరుచుకోచ్చన్న విషయం అందరికి తెలియదు.

గ్రీన్ టీలో ఉండే విటమిన్ ఇ పాదాలకు తేమను అందించటంతోపాటు, ఎండ, చెమట కారణంగా వచ్చే అలర్జీలను దరిచేరకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పాదాల రక్షణకు తోడ్పడతాయి. ఎండాకాలంలో వేడి కారణంగా పాదాలపై చర్మం రంగు మారుతుంటుంది. ట్యాన్ ఎక్కువవుతుంది. అలాంటి వాటిని తొలగించటంలో గ్రీన్ టీలో ఉండే విటమిన్ సి దోహదపడుతుంది.

పాదాలను గ్రీన్ టీ తో శుభ్రం చేసుకునేందుకు ముందుగా నాలుగు గ్రీన్‌ టీ సంచులను కొన్ని వేడినీళ్లు తీసుకుని అందులో వేయాలి. టీ నీళ్లలో కలిసిపోయే లోపు కాళ్లను సబ్బుతో కడిగి శుభ్రం చేసుకోవాలి. నీళ్లు గోరువెచ్చగా అవగానే బకెట్‌లో కొంచెం మినరల్‌ బాత్‌ సాల్ట్‌ కలపాలి. పాదాలను15 నిమిషాలపాటు ఆనీటిలో ఉంచాలి. ఆ తర్వాత ప్యూమిస్‌ స్టోన్‌ తో పాదాలను బాగా రుద్దాలి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. అనంతరం పాదాలను శుభ్రం చేసుకోవాలి. మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. సున్నితంగా మర్దన చేసుకుంటే పగుళ్లు సులభంగా తొలగిపోతాయి.