Dress Price: రూ. 500 విలువ చేసే కుర్తాను ఏకంగా రూ.2.5 లక్షలకు అమ్మేస్తున్నారుగా..

ఆన్​లైన్ లో కొన్ని వస్తువుల ధరలు చూస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు. వస్తువులు ఒక ప్లాట్ ఫామ్ లో ఒకరేటు ఉంటే, మరో ప్లాట్ ఫామ్ లో ఇంకో రేటు ఉంటుంది. అయితే తాజాగా గుస్సి అనే ఇటాలియన్ ఫ్యాషన్ హౌజ్​ ప్లాట్​ఫామ్ భారతీయ యువతులు ఇష్టపడే కుర్తా పైజామాలను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

Dress Price: రూ. 500 విలువ చేసే కుర్తాను ఏకంగా రూ.2.5 లక్షలకు అమ్మేస్తున్నారుగా..

Dress Price

Dress Price: ఆన్​లైన్ లో కొన్ని వస్తువుల ధరలు చూస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు. వస్తువులు ఒక ప్లాట్ ఫామ్ లో ఒకరేటు ఉంటే, మరో ప్లాట్ ఫామ్ లో ఇంకో రేటు ఉంటుంది. అయితే తాజాగా గుస్సి అనే ఇటాలియన్ ఫ్యాషన్ హౌజ్​ ప్లాట్​ఫామ్ భారతీయ యువతులు ఇష్టపడే కుర్తా పైజామాలను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

అయితే వీటి ధరను మాత్రం భారీగా నిర్ణయించింది. ఒక కుర్తా ధర ఏకంగా 2100 డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో దీని ధర అక్షరాలా లక్షన్నరకు పైమాటే.. ఇందులో ఖరీదైన మోడల్ కావాలి అంటే 3500 డాలర్లు చెల్లించాల్సిదే.. దీని రేటు భారతీయ కరెన్సీలో రూ.2.5 వరకు ఉంటుంది. ఇక వీటిని ఆన్​లైన్ లో చూసిన భారతీయ వినియోగదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. గుస్సి కంపెనీని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

ఇక కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్ వీధి వ్యాపారుల దగ్గర రూ.100 కే దొరుకుతుందని కొందరు అంటే.. ఐదు వందలకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమని ఇంకొందరు అంటున్నారు. మరో నెటిజన్​ స్పందిస్తూ దీన్ని రూ.2.5 లక్షలు కాదు.. రూ. 250లకు కొనడానికి కూడా ఆలోచిస్తారు. బ్రాండ్​ పేరు చెప్పి ఇతం ఖరీదు ప్రకటించడం ఏమైనా బాగుందా.”అంటూ ట్వీట్ చేశాడు.