Monsoons Hair Health : వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యం ముఖ్యమే! ఈ జాగ్రత్తలు పాటిస్తే?

ఎక్కువ సమయం తలను దువ్వకూడదు. దీని వల్ల జుట్టు రాపిడికి గురై తెగిపోతుంది. చివర్లు చిట్లిపోతాయి. జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. తడితలను ఎక్కువ సమయం దువ్వకుండా ఉండటమే మంచిది. తేమ కోల్పోవడం వల్లే జుట్టు నిర్జీవంగా, బిరుసుగా మారిపోతుంది.

Monsoons Hair Health : వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యం ముఖ్యమే! ఈ జాగ్రత్తలు పాటిస్తే?

Hair health monsoons

Monsoons Hair Health : వర్షంలో తడవడం వల్ల జుట్టు బిరుసుగా, జిడ్డుగా, పొడిగా మారిపోతుంటుంది. కురులు పట్టులా, మెత్తగా ఉండాలని కోరుకునే వారు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది. వర్షాకాలంలో అది కాస్త కష్టమే అనిపించినా జుట్టు ఆరోగ్యం శ్రద్ధచూపించక తప్పదు. వర్షంలో తడిచినా కురుల సౌందర్యం చెక్కు చెదరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వానాకాలంలో వర్షం కురిసినప్పుడు మినహా మిగిలిన రోజుల్లో ఉక్కపోత ఉంటుంది. దీనివల్ల శరీరంపైనే కాకుండా కుదుళ్ల పైన చెమట పడుతుంది. దీనికి దుమ్ము, ధూళి కూడా తోడవడం వల్ల జుట్టు జిడ్డుగా తయారవుతుంది. తరచూ తలస్నానం చేయటం వల్ల దీనిని నిరోధించవచ్చు. క్రమం తప్పకుండా వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయడం మంచిది.

వర్షంలో తడవడం వల్ల జుట్టు ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. తడిసిన జుట్టును దువ్వడం, జడ వేసుకోవడం, ముడి వేసుకోవడం, గట్టిగా రబ్బరు పెట్టుకోవడం లాంటివి చేయరాదు. అలా చేయటం వల్ల జుట్టు తెగిపోయే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో జుట్టు ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. జుట్టు బాగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి.

ఎక్కువ సమయం తలను దువ్వకూడదు. దీని వల్ల జుట్టు రాపిడికి గురై తెగిపోతుంది. చివర్లు చిట్లిపోతాయి. జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. తడితలను ఎక్కువ సమయం దువ్వకుండా ఉండటమే మంచిది. తేమ కోల్పోవడం వల్లే జుట్టు నిర్జీవంగా, బిరుసుగా మారిపోతుంది. అలాగే తరచూ తలస్నానం చేయడం, తలపై మురికి చేరడం వల్ల కూడా వెంట్రుకలు పొడిగా తయారవుతాయి. కాబట్టివెంట్రుకలను కండిషనింగ్ చేసుకోవడం తప్పనిసరి. వెంట్రుకలు తడి ఆరిన తర్వాత వెడల్పు పళ్లున్న దువ్వెనతో దువ్వుకోవాలి.

మనం ఉపయోగించే షాంపూ కొన్ని సార్లు జుట్టుపై చేరిన మురికితో పాటు తేమను, సహజసిద్ధమైన నూనెలను కూడా తొలగిస్తుంది. పైగా వర్షాకాలంలో జుట్టు పొడిగా, బిరుసుగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో మనం ఉపయోగించే షాంపూ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.