Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!

పొడి దగ్గుతో ఉండేవారు గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. నీళ్లను కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. గొంతులో తడి ఆరకుండా చూసుకోవాలి. వేడి ఆవిరి పట్టుకోవాలి. దీని వల్ల శ్లేష్మం వెళ్లిపోతుంది.

Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!

Dry Cough

Dry Cough : సీజన్ లు మారుతున్న సమయంలో శరీరంలోని రక్షణ వ్యవస్ధ త్వరగా మార్పలకు లోనవుతుంది. దీని వల్ల ఇన్ ఫెక్షన్స్ బారిన పడాల్సి వస్తుంది. వాతవరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యల్లో పొడి దగ్గు కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నవారు అధికమనే చెప్పాలి.

వాతావరణంలో మార్పులు, పొగ, దుమ్ము, రసాయనాల వాడకం వల్ల పొడి దగ్గు వస్తుంది. పొడిదగ్గును ఆదిలోనే అరికట్టకపోతే ఆపై అనేక నష్టాలు కలుగుతాయి. పొడిదగ్గువల్ల తల పట్టేస్తుంది. గొంతుతో పాటు శ్వాసకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. పొడిదగ్గు తీవ్ర రూపం దాల్చితే మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

పొడి దగ్గుతో ఉండేవారు గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. నీళ్లను కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. గొంతులో తడి ఆరకుండా చూసుకోవాలి. వేడి ఆవిరి పట్టుకోవాలి. దీని వల్ల శ్లేష్మం వెళ్లిపోతుంది. తేనె, పిప్పరమెంట్స్‌ తీసుకోవటం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. గ్రీన్‌ టీ తాగటం వల్ల పొడి దగ్గు తగ్గేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. పొగ తాగటం మానేయాలి. ధూమపానం వల్ల పొడి దగ్గు తీవ్రత పెరుగుతుంది.

బ్రీతింగ్ వ్యాయామాలైన ప్రాణాయామం, యోగా వంటివి నిత్యం చేయాలి. పొడిదగ్గు భరించలేకుండా ఉంటే మంచంపై వెల్లకిలా పడుకొంటే కొంత ఉపశమనం పొందవచ్చు. దగ్గు తగ్గకుండా వేధిస్తుంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.