Apples : ఆపిల్ పండ్లలో హానికరమైన బ్యాక్టీరియా…మీకు తెలుసా?
సాధారణ ఆపిల్ లో హానికర బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. వీటిలో ఎశ్చరీషియా షిజెల్లా వంటి హానికర బ్యాక్టీరియా ఉందని,

Apples : రుచికరమైన, పోషకవిలువలు కలిగిన పండ్లలో యాపిల్ పండు ఒకటి. ఎరుపు వర్ణంలో ఉండే యాపిల్ ను ఇష్టపడని వారుండరు. తీపిదనంతో జ్యూసిగా ఉండే యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈపండులో ఫైబర్లు, విటమిన్లు మెండుగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి, గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. రోజుకో యాపిల్ తింటే వైద్యుడితో పనిలేదని చెప్తుంటారు. రోజుకో యాపిల్ తింటే అనారోగ్యం దరిచేరదని చెబుతారు.
విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఆపిల్ తినాలని సూచిస్తారు వైద్యులు. 240 గ్రాముల బరువున్న యాపిల్ లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని చాలా మందికి తెలియదు. ఈ బ్యాక్టీరియా కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆపిల్ పండ్లను సేంద్రీయ, సాంప్రదాయ పద్దతుల్లో పండిస్తారు. ఈ రెండు పద్దతుల్లోనూ ఆపిల్ లో బ్యాక్టీరియా ఉంటుంది. ఆపిల్ లో ఎక్కవ శాతం బ్యాక్టీరియా గింజలలో ఉంటుంది. అయితే వీటిల్లో రెండు రకాల బ్యాక్టీరియా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా శరీరానికి ఎంతో అవసరం. అయితే చెడు బ్యాక్టీరియా వల్ల మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది. ఆర్గానిక్ ఆపిల్ లో తొక్క, కండ భాగంలో బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది.
సాధారణ ఆపిల్ లో హానికర బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. వీటిలో ఎశ్చరీషియా షిజెల్లా వంటి హానికర బ్యాక్టీరియా ఉందని, సేంద్రియ ఫలాల్లో హానికర బ్యాక్టీరియా పెద్దగా లేదని తేల్చారు నిపుణులు. సేంద్రియ యాపిల్లలో మిథైలోబ్యాక్టీరియం, లాక్టోబాసిల్లై వంటి మేలురకం బ్యాక్టీరియా అధికంగా కనిపించిందని వెల్లడించారు. ఆర్గానికి ఆపిల్ పండ్లలో పేగులకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎంతో అవసరం.
ఇటీవలికాలంలో యాపిల్ తోటల్లో పురుగుమందుల వినియోగం బాగా పెరిగింది. దీంతో విష రసాయనాలు ఆపిల్ తొక్కపై అధికశాతం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఆపిల్ తినే ముందు తొక్క తొలగించుకుని లోపలి భాగం తినటం మేలని సూచిస్తున్నారు. అయితే తొక్క తొలగించటం వల్ల పోషక విలువలు పోతాయి. దీని పరిష్కారం ఆపిల్ కొనే టప్పుడు సేంద్రీయ పద్దతిలో సాగైన ఆపిల్ పండ్లను కొనుగోలు చేయటం ఉత్తమం.
1Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..
2Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
3PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
4Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
5YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
6UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
7Kedarnath: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
8Nepal plane: నేపాల్‌లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు
9Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..
10pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్లలకు అస్వస్థత
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు