Health : బెల్లంతో కలిపి నువ్వులు రోజు తింటే?…

శరీరంలో పోషకాలు పెరగటానికి బెల్లం, నువ్వులను చేర్చుకోవాలని న్మామి అగర్వాల్ సూచిస్తున్నారు. నువ్వులలో కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

Health : బెల్లంతో కలిపి నువ్వులు రోజు తింటే?…

Sesame Seeds, Jaggery

Health : కరోనా రాకతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తీసుకునే ఆహారాల విషంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. తీసుకునే ఆహారం రుచితోపాటు పోషవిలువలు అవసరతపై ప్రస్తుతం ప్రత్యేమైన దృష్టిసారిస్తున్నారు. తినే ఆహారం ద్వారా ఆరోగ్యం సిద్ధించాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అయితే మనం తీసుకునే ఆహారాల్లో రెండు ముఖ్యమైన ఆహారాలు ప్రపంచంలోనే అత్యంత పోషకవిలువలు కలిగిన ఆహారాలుగా గుర్తించబడ్డాయి. ఇంతకీ ఆహారాలు ఏంటీ…వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాన్ని పోషకాహార నిపుణులు న్మామి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

శరీరంలో పోషకాలు పెరగటానికి బెల్లం, నువ్వులను చేర్చుకోవాలని న్మామి అగర్వాల్ సూచిస్తున్నారు. నువ్వులలో కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ , మెగ్నీషియం మంచి మూలంగా నువ్వులను చెప్పవచ్చు. నువ్వులు గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మరోవైపు బెల్లంలో ఇనుము, యాంటీఆక్సిడెంట్లకు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియకు బెల్లం మేలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తిన్నప్పుడు, రెండు ఆహారాల ద్వారా లభించే ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా ఆమె అభివర్ణిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత ప్రతి రోజు బెల్లం, నువ్వులు కలిపి తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

అంతేకాకుండా న్మామి అగర్వాల్ ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని రకాల ఆహారాల గురించి పంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తప్పనిసరిగా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాల గురించి వివరించారు. నారింజలో విటమిన్ సి అధికంగా లభిస్తుందని వాటిని జ్యూస్ రూపంలో కాకుండా తొనల రూపంలోనే తీసుకోవాలని సూచించారు. విటమిన్ సి లభించే కివిలో సుమారు 60 మిల్లీగ్రాముల ఆస్కార్బిక్ ఆమ్లాం లభిస్తుండగా, ఒక పచ్చి మిరపకాయ109 మిల్లీగ్రాముల విటమిన్ సిని కలిగి ఉంటాయని తెలిపారు. స్ట్రాబెర్రీలు కూడా రోగనిరోధక శక్తికి మంచివి. ఇవి కాకుండా, బ్రోకలీ, జామ, మొలకలు,కాలీఫ్లవర్‌లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని అగర్వాల్ అంటున్నారు.

https://www.instagram.com/reel/CZrQPppsfRa/?utm_source=ig_web_button_share_sheet