Weight : వివాహం తరువాత బరువు పెరిగారా?…తగ్గించుకునేందుకు ఇలా చేసి చూడండి!….

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగడానికి, ఎముకలు బలహీనపడటం వంటివి చోటు చేసుకుంటాయి. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల తీసుకున్న ఆహార పదార్థాల నుండి పోషకాలను శరీరం గ్రహించదు..

Weight : వివాహం తరువాత బరువు పెరిగారా?…తగ్గించుకునేందుకు ఇలా చేసి చూడండి!….

Weight After Marriage

Weight : వివాహం తరువాత వివిధ కారణాల వల్ల దంపతుల్లో చాలా మంది అనుకోకుండా బరువు పెరుగిపోతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పెళ్ళి తరువాత తమకు తెలియకుండానే సంతోషంలో మోతాదుకు మించి ఆహారాలు తీసుకోవటం, అంతేకాకుండా ఏది తినాలో, ఏది తినకూడదో తెలియక అందుబాటులో ఉన్న ఆహారాలను లాగించేయటం, రోజు వారి వ్యాయమాల గురించి పట్టించుకోక పోవటం వల్ల చాలా మంది వివాహం తరువాత అమాంతం బరువు పెరిగిపోతారు.

పెరిగిన బరువును అదుపులోకి తీసుకురావటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఏమాత్రం ఫలితం ఉండదు. ముఖ్వంగా ఇంటికే పరిమితమయ్యే మహిళల్లో ఈ బరువు సమస్య ఎక్కవగా ఉంటుంది. అలాంటి వారు బరువు తగ్గేందుకు కొన్ని సూచనలు పాటిస్తే తప్పకుండా సమస్య నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి.

చాలా మంది తమ రోజువారి ఆహారంగా బియ్యాన్ని తీసుకుంటారు. అన్నం తినటం అనేది బరువు పెరగడానికి ముఖ్యమైన కారణంగా పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బియ్యానికి బదులుగా గోధుమ చపాతీ, సోయా బీన్స్, ఉడికించిన బఠానీలు, చిక్ బఠానీలు వంటి వాటిని తీసుకోవాలి. వైట్ బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలకు బదులుగా, మొత్తం గోధుమ రొట్టె, కాల్చిన బంగాళాదుంప, వోట్మీల్, బ్రౌన్ రైస్ వంటి వాటిని తీసుకోవాలి. వీటిలో ఫైబర్స్ అధికంగా ఉంటాయి. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.. దీంతో త్వరగా ఆకలి వేయదు. తద్వవారా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

సాల్మన్, ట్యూనా, వాల్‌నట్, ఆలివ్ ఆయిల్ , అవిసె గింజల నూనెలలో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను రోజువారిగా ఆహారాల్లో తీసుకోవటం మంచిది. ఇవి బరువు తగ్గడానికి ,ఆరోగ్యంగా ఉంచడానికి మీకు సహాయపడతాయి. జంక్ ఫుడ్ , ప్రాసెస్ చేసిన ఆహారాలు చక్కెర స్థాయిలను పెంచటంతోపాటు మానసిక స్థితిలో మార్పులకు కారణమౌతాయి. అంతేకాకుండా జీవక్రియ రేటును తగ్గిస్తాయి. వీటిలో బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొవ్వులు ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం వల్ల బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది.

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగడానికి, ఎముకలు బలహీనపడటం వంటివి చోటు చేసుకుంటాయి. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల తీసుకున్న ఆహార పదార్థాల నుండి పోషకాలను శరీరం గ్రహించదు.. హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. జంతు మాంసాలను ఎక్కువగా తినటం వల్ల అందులో ఉండే ప్రోటీన్ వల్ల ఎముకలు కాల్షియాన్ని కోల్పోయి ఎముకలు బోలుగా మారతాయి. బరువు పెరగడానికి దారితీస్తాయి. వీటికి బదులుగా చికెన్ ప్రోటీన్లు తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, బీన్స్, బఠానీలు , కాయలు ప్రోటీన్లు కలిగిన ఆహారాలు తీసుకోవాలి.

ఉదయం అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. చాలా మంది ఉదయం అల్పాహారాన్ని మానేస్తారు. ఇలా చేయటం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవటం మంచిది. గుడ్లు, పండ్ల రసాలు, వోట్స్, పాలు , తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవచ్చు. మహిళలు ఎక్కువగా ఐరన్ కలిగిన ఆహారాలను తీసుకోవాలి. బచ్చలి కూర, బాదం వంటి రిచ్ ఫుడ్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. లేదంటే మహిళల్లో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం మొదలైనవి తీసుకోవాలి.

బరువు తగ్గాలన్న ఉద్దేశంతో కడుపును ఖాళీగా ఉంచటం మంచిది కాదు. రోజు మొత్తంలో ఒకేసారి కాకుండా కొద్దికొద్ది మొత్తాల్లో ఆహారాన్ని విడతలవారీగా తీసుకోవటం మంచిది. అప్పుడప్పుడు దంపతులు ఇద్దరు తమ పెళ్ళికి ముందు చిత్రాలను చూడటం మంచిది. ఇలా చేయటం వల్ల అప్పట్లో ఎలా ఉండేవారో, పెళ్ళి తర్వాత ఎలా ఉన్నారో పోల్చుకుని బరువు తగ్గించుకునే లక్ష్యంపై దృష్టిసారించే అవకాశాలు ఉంటాయి.